HomedevotionalHoroscope Today: 16-09-2022 శుక్రవారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి నేడు శుభ ఫ‌లితాలు రానున్నాయి..!

Horoscope Today: 16-09-2022 శుక్రవారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి నేడు శుభ ఫ‌లితాలు రానున్నాయి..!

Telugu Flash News

Horoscope Today:

మేషం

మేషం రాశి వారు ప్రత్యర్థులను కూడా ఓడిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆదాయ వ‌న‌రుల కొర‌త వ‌ల‌న కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తే ఛాన్స్ ఉంది. బడ్జెట్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

మీ ఇంటికి సంబంధించిన పనుల్లో కొంత ఖర్చు చేయాల్సి రావొచ్చు, ఆ స‌మ‌యంలో కొంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

వృష‌భం

మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మరోవైపు సన్నిహితుల సలహాలు వింటే ప‌లు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌తారు. పెద్దల మార్గదర్శకత్వం మీకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారం నిర్వహించే విధానంలో మార్పుల గురించి ఆలోచించ‌డం మంచిది.

-Advertisement-

మిథునం

ఈ రాశి వారు ఈరోజు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆస‌క్తిని చూప‌డ‌మే కాక ఆనందాన్ని పొందుతారు. మీ పని పట్ల అంకితభావ స్ఫూర్తి మీకు కొన్ని కొత్త అవ‌కాశాల‌ను తెచ్చిపెడుతుంది. ఈరోజు ఇతరులపై ఆధారపడకుండా, మీ సామర్థ్యాన్ని న‌మ్ముకోండి

క‌ర్కాట‌కం

ఈ రాశి వారు పని పట్ల ఏకాగ్రతతో ఉండాల్సి ఉంటుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని ప‌నులు స‌కాలంలో పూర్తి అవుతాయి.

ఈరోజు మీరు ఓ ముఖ్యమైన విషయం గురించి కాస్త ఎక్కువ‌ చింతించాల్సి ఉంటుంది.. అలాంటి పరిస్థితుల్లో మీరు జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది. 60 శాతం వ‌ర‌కు అదృష్టం మీ వెంటే ఉంటుంది.

సింహా రాశి

ఈ రాశి వారు నేడు మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దీని వల్ల మీకు మంచి ఫలితాలొస్తాయి. తొంద‌ర‌ప‌డి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఎవరో తెలియని వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.

క‌న్యా రాశి

ఈ రాశి వారు మ‌న‌సుకు న‌చ్చిన ప‌నులు చేసి సంతోషం పొందుతారు. ప‌ని బాగుంటుంది. ఈరోజు మీ ప‌నులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. కాబట్టి మీ ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. 82 శాతం వరకు అదృష్టం మీకు లభిస్తుంది.

తులా రాశి

ఈ రాశి వారు స్నేహితుడితో డబ్బు విషయంలో గొడవలు ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే కాస్త జాగ్రత్తలు తీసుకుంటే అంతా సర్దుకుపోతుంది. మీడియా, మార్కెటింగ్ మొదలైన వ్యాపారంతో కూడిన వ్యక్తులకు విజయవంతంగా ఉంటుంది. 72 శాతం వరకు అదృష్టం మీకు లభిస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేయడం వంటి వాటిపై ఎక్కువ ఆస‌క్తి చూపుతుంటారు. పొరుగువారితో కొంత వివాదాలు లేదా గొడవలు జ‌రిగే అవ‌కాశం ఉంటుంది .

మీరు ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచింది. మీ వ్యక్తిగత పని కారణంగా మీ వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ చూపలేక‌పోవ‌చ్చు.

మ‌క‌ర రాశి

ఈ రాశి వారి ఆర్ధిక ప‌రిస్థితి మెరుగుప‌డే అవ‌కాశాలు ఉంటాయి. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మంచిది. ఈ సమయంలో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు నిలిచిపోవచ్చు. ఈరోజు మీరు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా స్వ‌శ‌క్తిని న‌మ్ముకోవ‌డం మంచిది.

కుంభ రాశి

ఈ రాశి వారు పూర్తి అంకితభావంతో చేయాలి. సామాజిక సేవలో కూడా మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ సన్నిహితులు లేదా బంధువులు మీ గురించి వ్యతిరేకంగా కొన్ని పుకార్లు వ్యాప్తి చేయొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, యువత తమ లక్ష్యాల నుంచి తప్పుకోకుండా చూసుకోవాలి.

మీనం

ఈ రాశి వారికి స్నేహితులు, బంధువుల పట్ల ఉన్న అపార్థాలన్నీ తొలగి క‌లిసి పోతారు. ఈరోజు పని ఎక్కువగా ఉండటం వల్ల మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేక‌పోవ‌చ్చు.

ఇతరుల పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోక‌పోవ‌డం మంచిది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీ పనులకు ఆటంకాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News