HomedevotionalHoroscope (15-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (15-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 15th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Aries horoscope

ఈ రాశి వారికి ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఎక్కువ‌గా ఉంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే ఛాన్స్ ఉంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Taurus horoscope

ఈ రాశి వారికి అన్నికార్యాల్లో విజయం ద‌క్కుతుంది.. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఏ మాత్రం ఉండవు. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. గౌరవ, మర్యాదలు అధికమయ్యే ఛాన్స ్ఉంది.. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందడం జ‌రుగుతుంది.ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Gemini

ఈ రాశి వారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం అవ‌స‌రం. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందే ఛాన్స్ ఉంది.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. మనోల్లాసాన్ని పొంద‌డం జ‌రుగుతుంది.. స్వల్ప అనారోగ్య బాధలు త‌లెత్తే అవ‌కాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Cancer horoscope

ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందే అవ‌కాశం ఉంది.. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Leo

ఈ రాశి వారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.. మోసపోయే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆర్థికపరిస్థితి కొంత ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు అస్స‌లు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగాచేసే ఛాన్స్ ఉంది.

-Advertisement-

horoscope today teluguకన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Virgo

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం కొంత చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన క‌లుగుతుంది.. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం అవ‌స‌రం. సహనం అన్నివిధాలామ‌న‌కు శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోయే ఛాన్స్ ఉంది..

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Libra horoscope

ఈ రాశి వారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో కొంత మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేసే అవ‌కాశం ఉంది.. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం అవ‌స‌రం. విమర్శలను కొంత ఎదుర్కోవాల్సి వస్తుంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Scorpio

ఈ రాశి వారు తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను క్ర‌మంగా పొందుతారు. అనారోగ్య బాధలు ఏ మాత్రం ఉండవు. సహోద్యోగులకు సహకరించే అవకాశం ఎక్కువ ఉంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉండే అవ‌కాశం ఉంది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Saggitarius

ఈ రాశికి చెందిన వారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవ‌కాశం ఉంది.విందులు, వినోదాల్లో క్ర‌మంగా పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరించే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రులను క‌ల‌వ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Capricorn horoscope

ఈ రాశికి చెందిన వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఏర్ప‌డుతుంది.. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో క్ర‌మంగా కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా పాల్గొనే ఛాన్స్ ఉంది. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Aquarius

ఈ రాశికి చెందిన వారి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవించే ఛాన్స్ ఉంది.. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల ఏ మాత్రం ప‌నికి రాదు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు April 15, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం ఉత్త‌మం. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో స్వ‌ల్ప‌ మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు క్ర‌మంగా చేస్తారు. ఆత్మీయుల సహకారం కొంత ఆలస్యంగా లభిస్తుంది.

మరిన్ని చదవండి :

భారతీయ ఋషులు ఎవరు? ఎంత మంది? ఆ ఋషుల వివరాలు తెలుసుకోండి..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News