Telugu Flash News

Horoscope Today: 14-10-2022 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ఖ‌ర్చులు ఎక్కువ అవుతాయి..

horoscope today

Horoscope Today:

మేషరాశి:

ఈ రాశి వారి కుటుంబంలో చికాకులు ఉంటాయి. గొడ‌వ‌లు కూడా జ‌రిగే అవ‌కాశం ఉంది. ఖ‌ర్చు ఎక్కువ అవుతుంది. వ‌స్తువుల‌ని కొనేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. ఆరోగ్యం విష‌యంలో కొంత జాగ్ర‌త్త వ‌హించాల్సిన అవ‌సరం ఉంది.

వృషభ రాశి :

ఈ రాశి వారు మాన‌స‌కి ఒత్తిడి చెందుతారు. ప‌నిలో మీకు అడ్డంకులు ఎదుర‌వుతాయి.ల‌క్ష్యాన్ని సాధించ‌డం కోసం ఏకాగ్ర‌త పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంటుంది. వ్యాపార విష‌యాల‌లో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మంచిది. కార్యాలయంలోని పనులన్నీ శాంతియుతంగా, సానుకూలంగా పూర్తి చేసుకుంటారు

మిధున రాశి:

ఈ రాశి వారికి ఆర్ధిక ప‌రిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండి. కుటుంబంతో ఆనందంగా గడపుతారు. ప్రయాణాల్లో ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

క‌ర్కాట‌క రాశి:

ఈ రాశి వారు అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెడ‌తారు. ఉత్సాహంతో ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంటుంది. కొత్త విష‌యాలు ప్రారంభించే ముందు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి :

ఈ రాశి వారు మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లుగుతారు. ఉద్యోగ‌స్తులు ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆస్తికి సంబంధించిన వ్యాపారంలో పెద్ద డీల్ జరిగే అవకాశం ఉంది. డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

కన్యా రాశి :

ఈ రాశి వారు సోమ‌రిత‌నం కార‌ణంగా ప‌నిని వాయిదా వేసుకుంటారు. ముఖ్య‌మైన ప‌నులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయం పొందడంతో సంతోషంగా ఉంటారు.. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా రాశి :

ఈ రాశి వారు ఎవరిని గుడ్డిగా న‌మ్మోద్దు. ఉద్యోగుల‌తో వాగ్వివాదం వ‌చ్చే ఛాన్స్ ఉంది. మీరు ఏదైన ముఖ్య‌మైన ప‌నిని పూర్తి చేయ‌డం వ‌ల‌న కంపెనీకి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. సంతానము వలన సంతోషము కలుగుతుంది.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారికి ఎవరితోనైనా విభేదాలు ఏర్పడవచ్చు. కోపం, ఉత్సాహాన్ని కాస్త నియంత్రించుకోవ‌డం మంచిది. అయితే, సహనం, వివేకంతో మీరు త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటారు. ఏదైనా ప్రమాదకర వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు, మీరు దాని గురించి పూర్తి స‌మాచారం తీసుకుంటే మంచిది. ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. విశ్రాంతి దొరుకుతుంది.

ధనుస్సు రాశి:

ఈ రాశి వారు ప్ర‌తి విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించండి. నిర్ణ‌యాల‌ని సొంతంగా తీసుకోకూడ‌దు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండ‌డం మంచిది. ఉద్యోగ‌స్తుల‌కి ఈ రోజు అనుకూల‌మైన స‌మ‌యంగా చెప్ప‌వ‌చ్చు.

మకర రాశ:

ఈ రాశి వారి అతి క్రమశిక్షణ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పడి చదువుతో రాజీ పడకూడదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారముల్లో జాగ్రత్త వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దత్తాత్రేయుని పూజించడం మంచిది.

కుంభ రాశి:

ఈ రాశి వారు న్యాప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. ఆ స‌మ‌యంలో అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది. ముఖ్య‌మైన ప‌నులు పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. రాబడి తగ్గుతుంది. శత్రువుల బాధలు ఎక్కువ‌వుతాయి.

మీన రాశి:

ఈరోజు మీకు అనుకూలముగా ఉంటుంది. కుటుంబ విషయాలలో సోదరులతో వాగ్వాదం చెందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇంటి పెద్దల సలహాలు, సూచనలు పాటించండి,

Exit mobile version