Telugu Flash News

ఈ రోజు రాశి ఫలాలు (14-03-2024)

Horoscope today telugu 14 03 2024

నక్షత్రాల గమనం మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ఈ రోజు రాశి ఫలాలు చదవండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Aries horoscope

ఈ రాశి వారు బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపించే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేసే అవ‌కాశం ఉంది. కొద్ది ప్రయత్నాలతో అదనపు ఆదాయానికి అవకాశాలు మెరుగ‌య్యే ఛాన్స్ ఉంది..

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Taurus horoscope

ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా సజావుగానే ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోవ‌డం జ‌రుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపించేలా ఛాన్స్ ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Gemini

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకుంటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ‌గా ఉంది. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Cancer horoscope

ఈ రాశి వారికి వ్య‌క్తిగత సమస్య ఒకటి స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది.. బంధువుల నుంచి ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో శుభవార్త వినే ఛాన్స్ ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Leo

ఈ రాశి వారు కుటుంబ విషయాల్లో ఆవేశ కావేషాలు, మొండితనం చేయ‌కూడ‌దు. అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్త‌మం. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లల నుంచి శుభవార్త వినే ఛాన్స్ ఉంది.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Virgo

ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలతో లేదా అనవసర మాటలతో సమస్యలు కొని తెచ్చుకోవద్దు. వ్యక్తిగత విషయాల్లో సన్నిహితుల సహకారం తీసుకోవడం ఉత్త‌మం. బంధువులలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Libra horoscope

ఈ రాశి వారికి రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Scorpio

ఈ రాశి వారికి ఒకటి రెండు ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Saggitarius

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి కొంత‌ చికాకు పెడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభించే ఛాన్స్ ఉంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Capricorn horoscope

ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెళ్లే ఛాన్స్ ఉంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇచ్చే ఛాన్స్ ఉంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Aquarius

ఈ రాశి వారికి సహచరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం ఎంతో ఉత్త‌మం. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన అవ‌స‌రం ఉంది.. వాగ్దానాలకు, హామీలకు కొంతకాలం పాటు దూరంగా ఉండ‌డం ఉత్త‌మం.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు March 14, 2024 Pisces horoscope

ఈ రాశి వారికి వ్యక్తిగత పనులు, ఇంటి పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం చాలా మంచిది. అదనపు ఆదాయం కోసం చేస్తున్నప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగే అవ‌కాశం ఉంది. ఎక్కువ‌గా ప్ర‌యాణాలు చేస్తారు.

also read :

Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

 

 

 

 

Exit mobile version