Homedevotionalhoroscope today : 13-11-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 13-11-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 13th november 2022 sunday: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Aries horoscope

ఈ రాశి వారికి మానసిక ఆందోళన తొల‌గిపోడానికి దైవధ్యానం అవసరం. కుటుంబ విషయాలు అంత సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ధనవ్యయం తప్పదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవ‌సరం. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు త‌ప్పనిస‌రి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Taurus

ఈరోజు వీరు నూతన కార్యాలను మొద‌లు పెడ‌తారు. మానసిక ఆనందం కొంత‌ పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులను క‌ల‌వ‌డం, నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేయ‌డం వంటివి చేస్తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Gemini

ఈరోజు వీరు బంధు, మిత్రులతో కలహం పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి . రుణప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబ పరస్థితులు చాలా సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Cancer horoscope

ఈరోజు వీరు నూతన గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. తలచిన కార్యాలు చాలా ఆలస్యంగా నెరవేరుతాయి.కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకోవ‌డం వంటివి చేస్తారు..

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Leo

ఈరోజు వీరికి మానసిక ఆందోళనతో కాలం ముగుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది.. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. అనవసర భయం క‌లుగుతుంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Virgo

ఈరోజు వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు త‌లెత్తుతాయి . విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. మానసిక ఆందోళన చెందుతారు. భ‌యం కూడా దూరం అవుతుంది.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Libra horoscope

ఈరోజు వీరు ఆర్థిక ఇబ్బందులతో చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన పొందుతారు. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు ప‌డొద్దు.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Scorpio

ఈరోజు వీరు వ్యవసాయ మూలకంగా లాభాలను పొందే అవ‌కాశం ఉంది.. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి జ‌రుగుతుంది.. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Saggitarius

ఈరోజు చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Capricorn horoscope

ఈరోజు వీరు మానసికాందోళతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు త‌లెత్తుతాయి. ఏ విషయంలోనూ నిరుత్సాహం అస్స‌లు పనికిరాదు.వృత్తిరీత్యా ఇబ్బందులను కొంత‌ అధిగమిస్తారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Aquarius

ఈరోజు స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త ప‌డాలి. పక్కదోవ పట్టించేవారి మాటలు అస్స‌లు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన క‌లుగుతుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం కూడా ఎక్కువ‌. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త వ‌హించాలి.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 13, 2022 Pisces horoscope

ఈరోజు ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి క‌లుగుతుంది.. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

also read news:

Viral video : రెచ్చిపోయి వధువుపై కేక్ రుద్దిన వరుడు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్లు

Sholay : హాస్పిటల్ బిల్ కట్టడానికి కనీసం 400 రూ. కూడా లేని రోజునే అంజ‌ద్‌ ఖాన్ షోలే సినిమాకు సంతకం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News