Homedevotionalhoroscope today telugu : 12-1-2023 గురువారం ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today telugu : 12-1-2023 గురువారం ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 12th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Aries horoscope

ఈ రాశివారు నేడు చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. కీలకమైన పనులు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. బద్ధకాన్ని దరిచేరనీయకుండా ఉండ‌డం మంచిది. ప్ర‌యాణాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

వృషభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Taurus horoscope

ఈరోజు ఈ రాశివారు సంతోషంగా కాలం గడిపే అవ‌కాశం ఉంటుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అన్ని విష‌యాల‌లో ధైర్యంగా ముందుకు సాగాలి.

మిథునం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Gemini

ఈ రోజు ఈ రాశివారికి ధన యోగం ఎక్కువ‌గా ఉంటుంది.. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఓ అడుగు ముందుకు వేస్తారు. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది

కర్కాటకం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు బుద్ధి బలం ఎక్కువ‌గా ఉంటుంది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాల్లో ముందుకు వెళ‌తారు.. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను పాల్గొంటారు.

horoscope today in teluguసింహం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Leo

ఈరోజు ఈ రాశివారు ఎవరినీ అతిగా నమ్మకుండా ఉండాలి. పట్టుదలతో ప్రయత్నించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా, సంతోషంగా, ఉత్సాహంగా గడుపుతారు.

-Advertisement-

కన్య – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Virgo

ఈ రాశివారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొంద‌గ‌లుగుతారు.. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

తుల – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Libra horoscope

ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలను తీసుకోవడంలోకొంత ఇబ్బందులు పడతారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

వృశ్చికం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Scorpio

ఈరోజు ఈ రాశివారు భ్యవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవ‌సరం ఉంది.. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. బంధు, మిత్రులతో విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవ‌కాశం ఉంది.

ధనస్సు – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Saggitarius

ఈరోజు ఈ రాశివారు సంతోషముగా కాలం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేపట్టే ఛాన్స్ ఉంది. కొందరి ప్రవర్తన ఈ రాశివారికి బాధిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మకరం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేయ‌గ‌లుగుతారు.. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుత్సాహం కలిగించే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువ‌గా ఉంటాయి.

కుంభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Aquarius

ఈ రోజు ఈరాశివారు శుభకార్యాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోత్సాహకర వాతావరణం ఏర్ప‌డుతుంది. బంధు,మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా దృఢంగా ఉండ‌గ‌లుగుతారు.

మీనం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 12, Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సక్సెస్ అయ్యే విధంగా నిర్ణయాలను తీసుకునే ఛాన్స్ ఉంది.. ధనధాన్య లాభాలు కలిగే అవకాశం ఉంది. వాణిజ్యరంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.

Also Read:

Viral video : 3 బైకులపై 14 మంది.. ఏం చేశారంటే.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Ambati Rambabu : ఏపీ మంత్రి అంబటిపై కోర్టు ఆగ్రహం.. కేసు నమోదుకు ఆదేశం.. ఎందుకంటే..!

Telangana New CS : తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి.. ఆమె ప్రొఫైల్‌ తెలుసా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News