Horoscope Today, 12th may 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కొంత కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు సకాలంలో పూర్తి చేసుకోలేకపోతారు.
వృషభం
ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికం అయ్యే ఛాన్స్ ఉంది.. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
మిథునం
ఈ రాశి వారు చేసే రుణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక కొంత మానసికాందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తుతాయి.. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కర్కాటకం
ఈ రాశి వారు ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున కొంత మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. కొంత విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహం
ఈ రాశి వారికి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించే అవకాశం ఉంది.
కన్య
ఈ రాశి వారికి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందే ఛాన్స్ ఉంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోయే ఛాన్స్ కూడా ఉంది..
తుల
ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలు ఎక్కువ.. స్త్రీల మూలకంగా శతృ బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిల పట్టుదల ఏ మాత్రం పనికిరాదు.
వృశ్చికం
ఈ రాశి వారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండుట చాలా మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందడం జరుగుతుంది. స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తుతాయి.
ధనుస్సు
ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించుట అన్ని విధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట చాలా ఉత్తమం. అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది.
మకరం
ఈ రాశి వారి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు రుణ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి.
కుంభం
ఈ రాశికి చెందిన వారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు.
మీనం
ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట ఉత్తమం. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థాన సూచనలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు కొంత చేస్తారు. ఆత్మీయుల సహకారం కొంత ఆలస్యంగా లభిస్తుంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE