Telugu Flash News

Horoscope (12-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today in telugu

Horoscope Today, 12th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారు గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో కొంత నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి వస్తుంది.

వృషభం

ఈ రాశి వారికి రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే కొంత గౌరవం దక్కుతుంది. క్షణికావేశం అస్స‌లు పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఎక్కువ‌గా ఉంది. అనారోగ్య బాధలు త‌లెత్తుతాయి.

మిథునం

ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమయ్యే అవ‌కాశం ఉంది.. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పాటించాలి.

కర్కాటకం

ఈ రాశి వారికి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు కొంత అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమించే ఛాన్స్ ఉంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. విదేశయాన ప్రయత్నాలు కూడా
ఫలిస్తాయి.

సింహం

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంవహించడం అన్నివిధాలా మంచిది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడాల్సిన అవ‌స‌రం ఉంటుంది.. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాలి. అనారోగ్య బాధలకు ఔషధసేవ త‌ప్ప‌నిస‌రి.

కన్య

ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా ప‌డ‌తాయి.. మానసిక చంచలంతో కొంత ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తవహించే ఛాన్స్ ఉంది.. కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండవు.

తుల

ఈ రాశి వారికి ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు కూడా ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి క్ర‌మేపి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం ఉత్త‌మం.. రహస్య శతృబాధలు ఉండే అవకాశం కూడా ఉంది.

వృశ్చికం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరే ఛాన్స్ ఉంది.. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింతన ఏ మాత్రం ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే ఛాన్స్ ఉంది..

ధనుస్సు

ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవించే అవ‌కాశం ఎక్కువ‌.. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి చాలా ప్ర‌య‌త్నిస్తే ఉత్త‌మం.

మకరం

ఈ రాశి వారిక ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం ఉత్త‌మం.. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవ‌కాశః ఉంది.. తీర్థయాత్రల‌కు ప్రయత్నిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు.

కుంభం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన కొంత ఉంటుంది.

మీనం

ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు త‌లెత్తుతాయి.. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించ‌డం మంచిది. దూర వ్యక్తుల పరిచయం ఏర్ప‌డ‌డం వ‌ల‌న సంతోషం ఏర్ప‌డుతుంది.

Also Read News :

Adipurush: ఆదిపురుష్ చిత్రాన్ని వ‌ద‌ల‌ని వివాదాలు.. తాజాగా కొత్త వివాదం ఏంటంటే..!

Samantha: స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు మార‌తారు.. నేనంతే: స‌మంత‌

child care : పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి..

moral stories in telugu : ఇద్దరు ఇల్లాళ్ళు.. కథ చదవండి

Niharika: ఆ రెండు ఫొటోలు మిన‌హా భ‌ర్త జ్ఞాపకాలు పూర్తిగా చెరిపేసిన నిహారిక‌.. ఏం జ‌రుగుతుంది..!

Allu Arjun: రేయ్.. అవినాష్ అంటూ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్‌కి వార్నింగ్ ఇచ్చిన బ‌న్నీ ఫ్యాన్స్

Exit mobile version