HomedevotionalHoroscope (12-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (12-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 12th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Aries horoscope

ఈ రాశి వారు నేడు చాలా ప్ర‌శాంతంగా ఉంటారు. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలను తీసుకుంటారు. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు బాగా రాణించే ఛాన్స్ ఉంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Taurus horoscope

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. అదనపు ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్లడం అవ‌స‌రం. ఉద్యోగంలో పని భారం పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Gemini

ఈ రాశి వారు విదేశీ సంస్థ నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు చదువు లేదా ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్లే సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం వస్తుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Cancer horoscope

ఈ రాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది. ప్రమోషన్ మీద బదిలీకి అవకాశం ఎక్కువ‌గా ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Leo

ఈ రాశి వారికి ఆర్ధిక ప‌రిస్థితి చాలా అనుకూలంగానే ఉంటుంది.. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేయడంలో సహచరులు సహకరిస్తారు. ఇతరులకు ఆర్థికంగా ఎక్కువ‌ సహాయం చేస్తారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మంచి కంపెనీ నుంచి ఆఫర్ ద‌క్కే ఛాన్స్ ఉంది.

-Advertisement-

horoscope today in teluguకన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Virgo

ఈ రాశి వారు ఉద్యోగంలో అధికార యోగం పట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. పరిచయస్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదురు తుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది.. పిల్లలు పురోగతి సాధిస్తారు. దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Libra horoscope

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి, లాభాల పరిస్థితి చాలా వరకు మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొందరు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదరవచ్చు. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవ‌కాశం ఉంది.. వృత్తి వ్యాపారాల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Scorpio

ఈ రాశి వారికి తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇరుగుపొరుగుతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఎక్కువ‌గా ఉంది. స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Saggitarius

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యానికి కొరత ఉండదు. వ్యక్తిగత పనుల రీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెంచే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి అనాయాసంగా పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్త‌మం.. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Aquarius

ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల ప్రచారాలు కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ఒత్తిడికి గురిచేస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 12, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. దూరప్రాంతం నుంచి పిల్లలు చూడటానికి వస్తారు. ఉద్యోగరీత్యా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అంది కొన్ని అవసరాలు తీరే ఛాన్స్ ఉంది.. వృత్తి నిపుణులు ఉద్యోగరీత్యా స్థిరపడతారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశం ఎక్కువ‌.

మరిన్ని వార్తలు చదవండి : 

Punarnavi: గే ఫ్రెండ్‌తో పున‌ర్న‌వికి గ‌ర్భం అంటూ ప్ర‌చారాలు

ఒకేచోట ఎన్టీఆర్ భార్య‌, నారా లోకేష్ భార్య‌.. ఎక్కడంటే ?

తెలంగాణలో ఐదు రోజుల అలర్ట్.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే..

Auto Ram Prasad: త‌న ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లకు క్లారిటీ ఇచ్చిన ఆటోరాం ప్ర‌సాద్

Shyamala: అడ్డంగా బుక్ అయిన యాంక‌ర్ శ్యామ‌ల‌.. తిట్టి పోస్తున్న నెటిజ‌న్స్

Smart Phone: స్మార్ట్‌ ఫోన్‌ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ మహిళ కంటి చూపు కోల్పోయింది!

Pushpa 2 : పుష్ప‌2 లో బ‌న్నీతో ర‌చ్చ చేయ‌బోతున్న హనీ రోజ్..

Viral Video: పెళ్లిలో పన్నీర్‌ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News