Telugu Flash News

Horoscope (11-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today in telugu

Horoscope Today, 11th april 2023: Check astrological prediction for your zodiac signs

మేష రాశి

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి కొంత పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉండే అవ‌కాశం ఉంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి బుధ, గురులు ప్రభావంచేత చేసే పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలము, వ్యాపారస్తులకు వ్యాపారమునందు లాభములు క‌లిగే అవ‌కాశం ఉంది.. వీరు ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు పోవ‌ద్దు.

మిథున రాశి

ఈ రాశివారికి మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాలి . వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది.. మరిన్ని శుభఫలితాల కోసం మిధునరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించ‌డం మంచింది.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములయందు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతున్నవి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది..

సింహ రాశి

ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఇబ్బంది పెట్టును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు జాగ్రత్త వహించవలసినటువంటి సమయము ఇది . స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

కన్యా రాశి

ఈ రాశి వారికి కొంత చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగుతుంది.

తులా రాశి

ఈ రాశి వారికి ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలిగే అవ‌కాశః ఉంది.. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. వివాదాల‌కి కొంత దూరంగా ఉండాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. జన్మరాశి యందు కేతువు, కళత్ర స్థానము శుక్ర రాహువుల ప్రభావంచేత కుటుంబములో సమస్యలు వేధించ‌బ‌డును. వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము అని చెప్పాలి.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ధనూరాశి వారికి ఈరోజు ధనలాభము, ఎక్కువ‌గా ఉంటుంది.

మకర రాశి

మకర రాశి వారికి కుటుంబ సౌఖ్యము కలుగును. ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయము.

కుంభ రాశి

ఈ రాశి వారికి శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఖర్చులలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొను సూచనలు. కుటుంబ సమస్యలతో వాగ్వివిదాలకు దూరంగా ఉండాలల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలిగే అవ‌కాశం ఉంది.

మీన రాశి

ఈ రాశి వారికి శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికమగును. మీనరాశివారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు చెడు సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉంటుంది. విద్యార్థులకు కష్ట సమయముగా చెప్పాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలిగే అవ‌కాశం ఉంది.

also read:

NTR30 :ఎన్టీఆర్ 30లో డ‌బుల్ రోల్‌తో పూన‌కాలు తెప్పించ‌బోతున్న ఎన్టీఆర్.. నిజ‌మెంత‌?

samyuktha menon Latest stills, Images, Photos 2023

Sunny Leone Latest Photos, Stills, images 2023

Allu arjun :అల్లు అర్జున్ అమ్మ‌వారి వేషం వెన‌క ఉన్న అస‌లు సీక్రెట్ ఇదే.!

Diabetes : డయాబెటిస్ ఉన్న వారు ఉదయాన్నే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ?

Kushi : సమంత – విజయ్ చిత్రానికి ‘ఖుషి’ టైటిల్ వాడ‌డం వెన‌క అస‌లు కార‌ణం తెలుసా ?

Millets : వేసవిలో ఏయే చిరుధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచిదంటే..

Renu desai : రేణు దేశాయ్ ఒక్క మాట అని ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జైలుకి వెళ్లేవాడు..

Exit mobile version