HomedevotionalHoroscope Today: 10-05-2023 బుధవారం ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope Today: 10-05-2023 బుధవారం ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 10th may 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు త‌లెత్తుతాయి.. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మాన‌సికాందోళ‌న‌తో కొంత‌ కాలం గ‌డుస్తుంది. ప్ర‌య‌త్న‌లోపం లేకున్నా స‌కాలంలో ప‌నులు పూర్తి చేసుకోలేక‌పోతారు.

వృష‌భం

ఈ రాశి వారికి రుణ ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త పాటించాల్సిన అవ‌స‌రం ఉంది.

మిథునం

ఈ రాశి వారు ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట ఉత్త‌మం. వృత్తిరీత్యా గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పొందే అవ‌కాశం ఉంది.. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. మ‌నోల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందుతారు.

క‌ర్కాట‌కం

ఈ రాశి వారికి రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క కొంత మానసికాందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు త‌లెత్తుతాయి.. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం ఎంతైన అవ‌స‌రం.

సింహం

ఈ రాశి వారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్లో జాగ్ర‌త్త‌గా ఉండుట చాలా ఉత్త‌మం. మోస‌పోయే అవ‌కాశాలుంటాయి. ఆర్థిక ప‌రిస్థితి కూడా కొంత ఆందోళ‌న‌క‌రంగా మారుతుంది. నూత‌న కార్యాలు ప్రారంభించ‌రాదు.

-Advertisement-

horoscope today in teluguక‌న్య

ఈ రాశి వారు త‌ర‌చూ ప్ర‌యాణాలు చేస్తారు. చిన్న విష‌యాల్లో మాన‌సికాందోళ‌న చెందుతారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండుట చేయాలి. స‌హ‌నం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. ఆవేశం వ‌ల్ల కొన్ని ప‌నులు చెడిపోయే అవ‌కాశం ఉంది..

తుల

ఈ రాశి వారికి ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీల మూల‌కంగా శతృ బాధ‌ల‌ను అనుభ‌వించే అవకాశం ఉంది.. పిల్ల‌ల ప‌ట్ల మిక్కిల ప‌ట్టుద‌ల ప‌నికిరాదు.

వృశ్చికం

ఈ రాశి వారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉండే అవ‌కాశం ఎక్కువ‌. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.. శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాల‌క్షేపం చేసే అవ‌కాశం ఉంది.

ధ‌నుస్సు

ఈ రాశి వారికి కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించుట అన్ని విధాలా ఉత్త‌మం. బంధు, మిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట అవ‌సరం. అన‌వ‌స‌ర ధ‌న వ్య‌యంతో రుణ ప్ర‌య‌త్నాలు కూడా చేయాల్సి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ సేవ త‌ప్ప‌నిస‌రి.

మ‌క‌రం

ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రిస్థితిని మీ అదుపులో ఉంచకోవ‌డం ఉత్త‌మం. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆర్థిక ఇబ్బందుల‌ను అధిగ‌మించుట‌కు కొంత రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. బంధు మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ఆల‌స్యంగా ల‌భించే అవ‌కాశం ఉంది.

కుంభం

ఈ రాశి వారికి కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా లేనందున మాన‌సికాందోళ‌న చెందుతారు. ప్ర‌తి ప‌ని ఆల‌స్యంగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది.. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండుట ఉత్త‌మం.. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

మీనం

ఈ రాశి వారికి అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట ఉత్త‌మం. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన సూచ‌న‌లు ఎక్కువ‌గా ఉంటాయి.. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు ఎక్కువ‌గా చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం కొంత ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News