HomedevotionalHoroscope (10-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (10-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 10th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Aries horoscope

మేష రాశి వారికి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఈవారం మధ్యస్థ ఫలితాలు కనబడుచున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. స్త్రీలు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించాలి.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Taurus horoscope

ఈ రాశి వారు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి .మనస్తాపము, అనారోగ్యం కలుగు సూచనలున్నాయి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. మీకు ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం పొందెదరు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Gemini

మిథున రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. ప్ర‌యాణాలు చేసెద‌రు. అప‌రిచితుల‌తో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Cancer horoscope

కర్కాటక రాశి వారు ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్దిక విషయాలు ఎంతో అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Leo

ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలయందు మధ్యస్థ ఫలితములు అధికముగా కనబడును. శని వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Virgo

ఈ రాశి వారికి మనస్పర్థలు ఏర్పడును. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ వారం ఒత్తిళ్ళు తగ్గును. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందెదరు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Libra horoscope

ఈ రాశి వారికి ప్రతీ పనియందు చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు, కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధిస్తుంది.. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు ఎక్కువ‌గా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

horoscope 2023వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Scorpio

వృశ్చికరాశి వారు చేసే ప్రతీ పనియందు విజయాన్ని పొందెదరు. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మంత్రం ప‌ఠించాలి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Saggitarius

ఈ రాశి వారికి ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. అన్ని పనులయందు విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి ఖర్చులు అధికమగును. ఖర్చులు కొంత‌ నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని వలన పనులయందు ఇబ్బందులు, ఆటంకములు ఏర్పడును. ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయం. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉంటాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Aquarius

కుంభ రాశి వారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అప్పులు పెరుగును. దశమ స్థానములో రవి, బుధుల ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నములు కలసివచ్చును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఈరోజు విద్యార్థులకు కలసి వచ్చును. కుంభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని ప‌ఠించ‌డం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 10, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి ఈ ఆర్ధిక లాభములు వ్యాపార లాభము కలుగును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. కీర్తి, సౌఖ్యము కలుగును. ఏ పనినైన ఆచి తూచి చేయ‌డం ఉత్త‌మం.

also read:

PT Usha: రాజ్యసభలో అరుదైన సన్నివేశం.. సభను నిర్వహించిన పీటీ ఉష

Bill Gates : లేటు వయసులో ఘాటు ప్రేమ.. లవ్‌లో పడిన బిల్‌ గేట్స్‌!

Overseas Education: ఇండియన్‌ స్టూడెంట్స్‌ డెస్టినేషన్‌.. యూఎస్‌, కెనడా, బ్రిటన్‌!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News