Homedevotionalhoroscope : మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు 10-01-2023

horoscope : మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు 10-01-2023

Telugu Flash News

Horoscope Today, 10th january 2023: Check astrological prediction for your zodiac signs

మేష రాశి:

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కీలకమైన పనులు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలను అందుకోల‌గలుగుతారు. బద్ధకాన్ని దరిచేరనీయకుండా ఉండండి.

వృషభ రాశి:

ఈరోజు ఈ రాశివారు సంతోషంగా కాలం గడిపే ఛాన్స్ ఉంటుంది.. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి.

మిధున రాశి:

ఈ రోజు ఈ రాశివారికి ధన యోగం ఉంటుంది.. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఓ అడుగు ముందుకు వేయాల్సిన అవ‌స‌రం ఉంది.. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

కర్కాటక రాశి:

ఈరోజు ఈ రాశివారు బుద్ధి బలం చాలా బాగుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాల్లో ముందు అడుగు వేస్తారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.

సింహ రాశి:

ఈరోజు ఈ రాశివారు ఎవరినీ ఎక్కువ‌గా నమ్మవద్దు. పట్టుదలతో ప్రయత్నించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్ర‌యాణాల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

-Advertisement-

కన్య రాశి:

ఈ రాశివారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొంద‌గ‌లుతారు.. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది.

తుల రాశి:

ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఏర్ప‌డుతుంది అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో కొంత ఇబ్బందులు పడతారు. అనవసర ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది.

horoscope 2023వృశ్చిక రాశి:

ఈరోజు ఈ రాశివారు భ్యవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ‌తారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. బంధు, మిత్రులతో విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవ‌కాశం ఉంది..

ధనస్సు రాశి:

ఈరోజు ఈ రాశివారు సంతోషముగా కాలం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జ‌రుగుతాయి.. కొందరి ప్రవర్తన ఈ రాశివారికి బాధిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

మకర రాశి:

ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు.. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుత్సాహం కలిగించే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువ‌.. వివాదాల‌కి దూరంగా ఉండండి.

కుంభ రాశి:

ఈ రోజు ఈరాశివారు శుభకార్యాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోత్సాహకర వాతావరణం ఏర్ప‌డుతుంది. బంధు,మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

మీన రాశి:

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సక్సెస్ అయ్యే విధంగా నిర్ణయాలను తీసుకోవ‌డం మంచిది.. ధనధాన్య లాభాలు కలిగే అవకాశం ఎక్కువ‌. వాణిజ్యరంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి.

also read: 

SKY: కిందపడుతూ, మీద ప‌డుతూ ఆ షాట్స్ సూర్య ఎలా ఆడ‌గ‌లుగుతున్నాడు…సీక్రెట్ చెప్పిన స్కై

Fact Check : పెన్ను,పెన్సిల్ తో 2000, 500 నోట్లపై రాస్తే అవి చెల్లుతాయా ? ఇందులో నిజమెంత ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News