HomedevotionalHoroscope Today: 09-12-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Horoscope Today: 09-12-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 9th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Aries horoscope

ఈ రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం త‌ప్ప‌క‌ లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆప్తుల సాయం పొందుతారు. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆదిత్య హృదయం పఠిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Taurus

బద్ధకాన్ని వీడితే మంచి ఫలితం ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితుల మ‌ధ్య విభేదాలు రావచ్చు.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Gemini

కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువ‌గా లాభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది.. కొన్ని విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిది. వినాయకుడిని పూజిస్తే చాలా సమస్యలు తొలగుతాయి.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Cancer horoscope

ఈ రాశులవారికి నేడు అనుకూల సమయం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఎక్కువ‌గా అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠిస్తే మేలు జ‌రుగుతుంది..

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Leo

ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని పెంచే ఛాన్స్ ఉంది.. కీలక విషయాల్లో పెద్దల ప్రశంసలు పొందుతారు. కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం ఎంతైన అవ‌స‌రం

-Advertisement-

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Virgo

ఈ రాశికి చెందిన వారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మికంగా మంచి చేకూరుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య విభేదాలు రాకుండా జాగ్ర‌త్తగా ఉండాలి.. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం పఠిస్తే మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Libra horoscope

ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. గొప్ప వారితో పరిచయం కూడా ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి పొందుతారు. అదనపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభం జ‌రుగుతుంది.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Scorpio

ఈ రాశి వారికి ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రోత్సాహకర వాతావరణం ఏర్ప‌డుతుంది.. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక విషయాలు చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం ఎంతో మంచిది.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Saggitarius

ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సహకారం ఎక్కువ‌గా లాభిస్తుంది. సమయస్ఫూర్తి, తెలివితేటలతో కొన్ని కీలక పనులు పూర్తి చేసే అవ‌కాశం ఉంది..ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయడం అవ‌స‌రం.

horoscope

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Capricorn horoscope

ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. కీలకమైన వ్యవహారాలు ఆలస్యమవుతాయి. ఉన్నత అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానంతో మేలు జ‌రుగుతుంది.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Aquarius

ఈ రాశి వారు చేపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూల వాతావరణం ఏర్ప‌డుతుంది.. ఖర్చులు అదుపుచేసుకోవాలి. శ్రమాధిక్యం త‌ప్ప‌నిస‌రి.. సాయి నామాన్ని స్మరిస్తే సానుకూల ఫలితాలు పొందే అవ‌కాశం ఉంది.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 9, 2022 Pisces horoscope

ఈ రాశి వారికి శుభఘడియలు నడుస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది.. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింప‌గ‌లుగుతుంది.. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

also read news:

Rohit: కోహ్లీ కెప్టెన్సీలో ఉన్న‌ది ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో లేనిది ఇదే.. అందుకే వ‌రుస ప‌రాజ‌యాలు..!

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News