Homedevotionalhoroscope today : 9-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 9-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, wednesday 9th november 2022: Check astrological prediction for your zodiac signs.

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Aries horoscope

ఈ రాశివారికి నేడు మిశ్రమ కాలం అని చెప్పాలి. కొన్ని కీలక పనుల్లో ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్త‌మం. ఆరోగ్యం విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Taurus

ఈ రాశివారు బంధు, మిత్రులను కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వ‌ల‌న ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. సొంత ఇల్లు కొనుగోలుకి ప్రయత్నాలు చేసి స‌క్సెస్ సాధిస్తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Gemini

ఈ రాశివారు చేపట్టిన పనులను త్వ‌ర‌గా పూర్తి చేస్తారు. ధన లాభం కొంత‌ కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధిని పొందుతారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించ‌డం వ‌ల‌న కుటుంబ పెద్దల మన్నన పొందుతారు.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు ధన లాభం పొందే అవ‌కాశం ఉంటుంది.. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన‌డం చేస్తారు. కీలక వ్యవహారాలలో ఆటంకం కలగకుండా చూసుకుంటే మంచిది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. పనితీరుతో ప్రశంసలను పొదుతారు. అలసట పెరగకుండా చూసుకోవ‌డం మంచిది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలను పాటించడం ఉత్త‌మం.

-Advertisement-

horoscope today newsకన్య రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను స‌కాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ముందడుగు వేస్తారు.. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవ‌కాశం ఉంది.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ల‌భిస్తాయి.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం చేస్తారు. శుభ ఫలితాలు చేకూరుతాయి.. కీలక కొనుగోలు వ్యవహారంలో లాభం క‌లుగుతుంది.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశివారు సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకోవడంలో కొంత‌ ఇబ్బంది పడతారు. మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు చేయాకుండా ఉండాలి.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొనే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. పని తీరుతో అందరి ప్రశంసలను పొందుతారు. అవసరానికి తగిన సహాయం ద‌క్కుతుంది. మానసికంగా సుఖశాంతులతో గడుపుతారు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Aquarius

ఈ రోజు ఈరాశివారికి బాధ్యతలు ఎక్కువ‌ పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్తలు వింటారు. ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది..

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 9, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా క‌లుగుతుంది.. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ‌తారు. శారీరక శ్రమ ఎక్కువ‌గా ఉంటుంది. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే ఛాన్స్ ఉంది.

also read these news :

తల్లిదండ్రులు తమ పిల్లల ముందు మాట్లాడకూడని 5 విషయాలు

అందానికి బాదాం ఫేస్ ప్యాక్ బెస్ట్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News