HomedevotionalHoroscope (09-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (09-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 9th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Aries horoscope

ఈ రాశి వారు నేడు కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచ‌లంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోమ‌రితనం ఆవ‌హిస్తుంది. పిల్ల‌ల ప‌ట్ల మిక్కిలి జాగ్ర‌త్త వ‌హిస్తారు. కొన్ని మంచి అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఆర్థిక ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండ‌వు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Taurus horoscope

ఈ రాశి వారు చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది. అనారోగ్య బాధ‌లు అధికం అయ్యే ఛాన్స్ ఉంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Gemini

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు కూడా అధికం అవుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లిసే ఛాన్స్ ఉంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Cancer horoscope

ఈ రాశి వారికి శుభ‌కార్యాల ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరును. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. ప్ర‌యాణాల వ‌ల్ల లాభం చేకూరును. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం త‌ప్ప‌క‌ ల‌భిస్తుంది. ధ‌న చింత ఏ మాత్రం ఉండ‌దు. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందే ఛాన్స్ ఉంది..

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Leo

ఈ రాశి వారు మాన‌సిక అందోళ‌న‌ల‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌లం అవుతాయి. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

-Advertisement-

horoscope 2023కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Virgo

ఈ రాశి వారికి కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించుట అన్ని విధాలా మంచిది. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట అవ‌స‌రం.. అన‌వ‌స‌ర ధ‌న‌వ్యయంతో రుణ ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ సేవ త‌ప్ప‌నిస‌రి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Libra horoscope

ఈ రాశి వారు ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మవుతాయి. రుణ ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లించే అవ‌కాశం ఉంది.. కుటుంబంలో మ‌నఃశాంతి లోపిస్తుంది. బంధు, మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట అవ‌స‌రం. ర‌హ‌స్య శ‌తృ బాధ‌లు ఉండే అవ‌కాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Scorpio

ఈ రాశి వారికి మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. అకాల భోజ‌నం వ‌ల్ల అనారోగ్య బాధల‌ను ఎంతో అనుభ‌విస్తారు. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది. చెడు స‌హ‌వాసానికి దూరంగా ఉండుట‌కు ప్ర‌య‌త్నించాలి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Saggitarius

ఈ రాశి వారికి ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ ఖ‌ర్చు చేస్తారు. తీర్థ యాత్ర‌ల‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం ఉంటుంది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి చంచ‌లం అధికం అవుతుంది. గృహంలో ఎన్నో మార్పులు కోరుకుంటారు. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. ప్ర‌య‌ణాలు ఉంటాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Aquarius

ఈ రాశి వారు బంధు, మిత్రుల‌తో మ‌నః స్ఫ‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆరోగ్య విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ‌తో పాటు, మాన‌సిక ఆందోళ‌న త‌ప్ప‌దు. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్ర‌మిస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 9, 2023 Pisces horoscope

ఈ రాశి వారు అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు వేధిస్తుంటాయి.. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండుట‌కు ప్ర‌య‌త్నింంచ‌డం మంచిది. దూర ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తూ ఉంటారు.

Also Read:

YS Jagan : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. విశాఖలో కొత్త ఏర్పాట్లు!

Nara Lokesh : లోకేష్‌ పాదయాత్రలో ఉద్రిక్తత.. మైకు లాక్కొనేందుకు యత్నించిన పోలీసులు

Kotamreddy Sridhar Reddy : ప్రభుత్వంపై వెనక్కి తగ్గేదే లేదు..!

KA Paul On Revanth Reddy : టెర్రరిస్టులా రేవంత్‌ వ్యాఖ్యలు.. వెంటనే అరెస్టు చేయాలి..

Viral Video : కమలా హ్యారిస్‌ భర్తకు జిల్‌ బైడెన్‌ లిప్‌ కిస్‌..

Dhanush Latest Movie Vaathi(Tamil) SIR (Telugu) Trailer

Hyderabad Traffic : ఓవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు కార్‌ రేసింగ్‌.. నగరవాసులకు నరకం..

Hyper Aadi: శృతి మించుతున్న‌ హైప‌ర్ ఆది బూతు కామెడీ..

Waltair Veerayya: ఓటీటీలోకి వాల్తేరు వీర‌య్య‌.. ఎప్పుడంటే ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News