Horoscope Today:
మేష రాశి
ఈ రాశి వారు అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఇష్టమైన వస్తువులు కొంటారు. మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడమే కాక నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.
వృషభ రాశి
ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
మిధున రాశి
ఈ రోజు మిధున రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు , వ్యాపారస్తులకు డబ్బుల విషయములో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు తలెత్తుతాయి.
కర్కాటక రాశి
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం వలన చేసే ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహముతో వారు ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబములోని సమస్యలు తొలగిపోతాయి.
సింహ రాశి
ఈరోజు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. మీరు విజయం సాధిస్తారు. చేసే ప్రతీ పనిలో ఇబ్బందులు ఏర్పడడం వలన. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చికాకులు ఎక్కువ గా ఉంటాయి. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉంటేనే బాగుంటుంది.
కన్యా రాశి
ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ అవసరాల కోసం డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయం సాధించడం వలన సంతోషంగా ఉంటారు..
తులా రాశి
ఈరోజు కుటుంబముతో ఉల్లాసముగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి
ఈరోజు మీ అవసరాల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇష్టమైన వస్తువులు కొంటారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ధనస్సు రాశి
ఈ రాశి వారు నేడు . కొత్త వస్తువులు కొంటారు. సమస్యలు పరిష్కారమవుతాయి. గొడవలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. మానసిక ఆందోళనలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకి చికాకు ఉంటుంది. శివారాధన చేయడం ఉత్తమం.
మకర రాశి
ఈ రాశి వారు అవసరాల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి
ఈరోజు ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైన ఉంది. శత్రువుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగములో సమస్యలు ఉంటాయి
మీన రాశి
ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిచండం మంచిది. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం వలన కొంత లాభాలు ఏర్పడే అవకాశం ఉంది.