Homedevotionalhoroscope today : 7-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 7-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 7th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Aries horoscope

ఈ రాశివారు ఈరోజు మిశ్రమ కాలం అని చెప్పోచ్చు. . కొన్ని కీలక పనుల్లో ఆలోచించి అడుగు ముందుకు వేస్తే మంచింది. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్త‌మం. ఆరోగ్యం విష‌యంలో కొంత జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు త‌మ‌ బంధు, మిత్రులను కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను పాల్గొంటారు. సొంత ఇల్లు కొనుగోలుకి ప్రయత్నాలు చేస్తారు. శుభకాలం అని చెప్పొచ్చు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులను స‌కాలంలో పూర్తి చేస్తారు. ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ పెద్దల మన్నన పొంద‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారికి ధన లాభం క‌లుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో ఆటంకం కలగకుండా చూసుకోవ‌డం మంచిది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది. పనితీరుతో ప్రశంసలను పొందుతారు. అలసట పెరగకుండా చూసుకుంటే మంచిది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలను పాటించడం ఉత్త‌మం.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను స‌కాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ముందడుగు వేస్తారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవ‌డం జ‌రుగుతుంది.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు వృథా ప్రయాణాలు చేస్తారు.. అనవసర ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు వ‌స్తాయి. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం మంచిది. శుభ ఫలితాలు కలుగుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో లాభం తప్ప‌క చేకూరుతుంది.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశివారు సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకోవడంలో కొంత‌ ఇబ్బంది పడతారు. మిశ్రమ వాతావరణం ఏర్ప‌డుతుంది.. అనవసర ఖర్చులు చేస్తారు. ఫ్యామిలీతో సంతోషంగా గ‌డుపుతారు.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Capricorn horoscope

ఈ రాశికి చెందిన వారు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో త‌ప్ప‌క ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. పని తీరుతో అందరి ప్రశంసలను పొందుతారు. అవసరానికి తగిన సహాయం వ‌స్తుంది.మానసికంగా సుఖశాంతులతో గడుపుతారు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Aquarius

ఈ రోజు ఈరాశివారికి బాధ్యతలు ఎక్కువ అవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్తలు వింటారు. ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 7, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువ‌గా ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ‌తారు.. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

also read :

తులసి మొక్కకు ఏ వేళలో నీళ్లు పోయాలి…

మునగాకు తింటే..మ‌స్తు బెనిఫిట్స్‌!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News