Telugu Flash News

Horoscope Today: 07-05-2023 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారి జీవితంలో శుభ‌ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి

horoscope today in telugu

Horoscope Today, 7th may 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది . ఎవరికీ హామీలు ఇవ్వ‌కుండా ఉండాలి.ఆకస్మిక ప్రయాణాలు చేసే అవ‌కాశం ఉంది.

వృషభం

ఈ రాశి వారికి ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. బంధువుల రాకతో కుటుంబంలో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మిథునం

ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది . వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం కూడా లేక‌పోలేదు.

కర్కాటకం

ఈ రాశి వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు క‌నిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం అవుతాయి..స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఎక్కువ‌గా ఉంటాయి.

సింహం

ఈ రాశి వారికి భాగస్వాములతో ప్రధాన సమస్యలను పరిష్కరించుకునే ఛాన్స్ ఉంది. కొందరు స్నేహితులు అపార్ధాలతో దూరమయ్యే అవకాశం ఉంది. కొంచెం సహనంతో వ్యవహరిస్తే మీ లక్ష్యాలు నెరవేరే సూచనలు కూడా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.

కన్య

ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది. డబ్బు నష్టం జరుగుతుంది. బంధువులతో విభేదాలు తలెత్తే అవ‌కాశం కూడా ఉంది. సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు కూడా ద‌క్కుతుంది.

తుల

ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మ‌కుండా ఉండాలి.

వృశ్చికం

ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం లేని వారు సంతాన యోగానికి సంబంధించితీపి కబురు వ‌స్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం కూడా ల‌భిస్తుంది.

ధనుస్సు

ఈ రాశి వారికి మొండి బాకీ ఒకటి అనుకోకుండా వసూలు అవుతుంది. చాలా కాలంగా పీడిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించే అవ‌కాశం కూడా ఉంది.

మకరం

ఈ రాశి వారికి మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి, తిప్పట ఎక్కువగానే ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది.

కుంభం

ఈ రాశి వారు కొద్దిగా అనారోగ్యంతో అవస్థ పడే సూచనలున్నాయి. ఎంతో శ్రమ మీద ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలించే అవ‌కాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళవు. ఆర్థిక లావాదేవీలు కూడా లాభంచకపోవచ్చు.

మీనం

ఈ రాశి వారికి కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళ‌న‌కి గురి చేస్తుంది.

Exit mobile version