HomedevotionalHoroscope (07-03-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (07-03-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 7th March 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Aries horoscope

ఈ రాశికి చెందిన వారు కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. బంధువులు, స్నేహితులు మీ సలహాలకు విలువ ఇస్తారు. పిల్లలు ఎంతో పురోగతి సాధిస్తారు. చదువులో విద్యార్థుల మీద ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది.. స్నేహితురాలికి విలువైన కానుకలు అందిస్తారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Taurus horoscope

ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ . వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. వృత్తిలో బాగా రాణించే అవ‌కాశం ఉంది.ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధించే అవ‌కాశం ఉంది.బంధువులకు సహాయం చేస్తారు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Gemini

ఈ రాశి వారు ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. విజయవంతంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేసే అవ‌కాశం ఉంది.. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండండి. ఆకస్మిక ధన లాభానికి ఎక్కువ‌ అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంటుంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Cancer horoscope

ఈ రాశి వారు ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం కొంత‌ నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. కొత్త స్నేహితులు పరిచయం సంతోషాన్ని ఇస్తుంది.. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేసే ఛాన్స్ ఎక్కువ‌.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Leo

ఈ రాశి వారికి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది.. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవ‌కాశం ఎక్కువ‌. జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

-Advertisement-

horoscope 2023కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Virgo

ఈ రాశి వారికి చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి, ఉద్యోగానికి ఇబ్బంది ఏ మాత్రం లేదు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగక‌పోవ‌చ్చు. కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరే ఛాన్స్ ఉంది.. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన అవ‌సరం ఎంతైన ఉంది. స్నేహితురాలు ముఖం చాటేసే అవ‌కాశం ఉంది.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Libra horoscope

ఈ రాశికి చెందిన వారికి కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించే అవ‌కాశం ఎక్కువ‌. కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు సమయం ఎంతో బాగుంటుంది..

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Scorpio

ఈ రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన ఎక్కువ‌గా చేస్తారు. రాదని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందే ఛాన్స్ ఎక్కువ‌. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందు, వినోదంలో పాల్గొంటారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Saggitarius

ఈ రాశి వారు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ప్రయాణాల మీద డబ్బు బాగా ఖర్చయ్యే ఛాన్స్ ఎక్కువ‌. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. విద్యార్థులు అభివృద్ధి సాధించే అవ‌కాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Capricorn horoscope

ఈ రాశి వారు మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దిగా ఆలస్యంగా అయినా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు ఈ రోజు బాగా అనుకూలంగా ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఎక్కువ‌.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Aquarius

ఈ రాశి వారు ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఎక్కువ‌గా అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెడితే బాగుంటుంది.. స్నేహితురాలికి విందులు ఇస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు March 07, 2023 Pisces horoscope

ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తి చేసే ఛాన్స్ ఉంది.. దగ్గరి బంధువులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే అవ‌కాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

also read :

Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

medico preethi case : మెడికో ప్రీతి కేసులో మరో మలుపు.. వైద్యులను విచారణ చేయాలి

Satvik Suicide Case : సాత్విక్‌ ఆత్మహత్య రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Chiranjeevi: చిరంజీవి చెంప కందిపోయేలా కొట్టిన హీరోయిన్.. అస‌లేమైంది..!

Sobhita Dhulipala hot instagram pics, photos, images 2023

Nani: నాని మాస్ లైన‌ప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే..!

Shruti Haasan hot and stylish black dress photos 2023

punishments in hell : నరకాలు – అక్కడ అనుభవించవలసిన శిక్షలు ఏంటో తెలుసుకోండి..

snacks for weight loss : ఆ స్నాక్స్‌ తింటే వెయిట్‌ లాస్‌ గ్యారెంటీ..

Gangavva: కొత్త ఇల్లు క‌ట్టుకోవ‌డానికి నాగార్జున ఎంత ఇచ్చాడో చెప్పిన గంగ‌వ్వ‌

pomegranate : దానిమ్మతో గుండె భద్రం.. బోలెడన్ని ప్రయోజనాలు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News