HomedevotionalHoroscope (07-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (07-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 7th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Aries horoscope

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఎన్నో ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఏర్ప‌డుతుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Taurus horoscope

ఈ రాశి వారి రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాల్సిన‌ అవసరం ఉంది..

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Gemini

ఈ రాశి వారి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల కొంత బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Cancer horoscope

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే ఛాన్స్ ఎక్కువ‌. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి కూడా.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Leo

ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు ప‌క్కాగా పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభించే అవ‌కాశం ఉంది.

-Advertisement-

horoscope 2023కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Virgo

ఈ రాశి వారు ఎక్కువ‌గా బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఏర్ప‌డుతుంది.. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Libra horoscope

ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందే ఛాన్స్ ఉంది.. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగవుతుంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Scorpio

ఈ రాశి వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులని ఎక్కువ‌గా గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ఎక్కువ‌గా ప్రాధాన్యమిస్తారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Saggitarius

ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు త‌లెత్తే అవ‌కాశం ఉంది.. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Capricorn horoscope

ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Aquarius

ఈ రాశి వారి స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు కొంత ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోవ‌ల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 7, 2023 Pisces horoscope

ఈ రాశి వారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని కాస్త‌ ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది.

Also Read : 

Allu Arjun : అల్లు అర్జున్‌ కి లారీ గిఫ్ట్‌.. ఎవరిచ్చారు ?

NTR : ఆరోగ్యం బాగోలేక‌పోయిన అన్న కోసం ఎన్టీఆర్..!

Varun Tej : వరుణ్ లావణ్య ల పెళ్లికి చిరంజీవి నో చెప్పాడా?

Bandla Ganesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాంటీగా మారిన బండ్ల గ‌ణేష్‌!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News