Horoscope Today, 6th december 2022: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం తప్పనిసరి చేయాలి. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు కూడా ఎక్కువవుతాయి.
వృషభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధించే అవకాశం ఉంది. నూతన కార్యాలను కూడా ప్రారంభిస్తారు. రుణవిముక్తి కలుగుతుంది.
మిథునం
ఈ రాశి వారికి కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహం పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించాల్సి ఉంటుంది.
కర్కాటకం
కుటుంబ విషయాలపై చాలా అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవసరం.
సింహం
ఈ రాశి వారికి బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఎక్కువగానే లభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అధికారులతో జాగ్రత్తగా మెలగడం తప్పనిసరి.
కన్య
ఈ రాశి వారికి మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక భయం మెల్లమెల్లగా దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు చాలా ఆలస్యంగా ఫలిస్తాయి.
తుల
ఈ రాశి వారు వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం వలన సంతోషం కలుగుతుంది.. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు అస్సలు పనికిరాదు.
వృశ్చికం
ఈ రాశికి చెందిన కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ మెల్లమెల్లగా పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం కూడా ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సఫలం అవుతాయి..
ధనుస్సు
కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది.. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది.. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.
మకరం
ఈ రాశి వారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళతో జీవిత కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు చాలా ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవసరం.
కుంభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశంఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్తలు పాటించాలి. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం ఉత్తమం.
మీనం
వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోయే ఛాన్స్ ఉంది.. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.