Horoscope Today:
06-10-2022 గురువారం ఈ రోజు రాశిఫలాలు..
మేషం : ఈ రాశి వారు నేడు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభ కార్యాల్లో పాల్గొంటారు .అందరినీ కలుపుకొనిపోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇష్టదైవ ప్రార్థనతో శుభం కలగగలదు.
వృషభం : కీలక విషయాలు, వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచింది. మిమ్మల్ని ఇష్టపడని వారు మీకు ఇబ్బందులు సృష్టిస్తారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం మంచిది.
మిథునం : స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగితే పర్వాలేదు కాని లేకుంటే ఇబ్బందులు తప్పవు. కుటుంబీకులు, బంధువులతో ప్రేమగా వ్యవహరించాల్సి ఉంది. చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పుడే పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి వారు ఆంజనేయ స్వామని ఆరాధిస్తే మంచిది.
కర్కాటకం : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటూ, అనవసర గొడవలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.. ఉద్యోగ విషయంలో మరింత శ్రద్ధగా ఉంటే మంచిది. శ్రీనివాసుడిని పూజిస్తే శుభం చేకూరడం ఖాయం.
సింహం : చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సంబంధించిన విషయం ఒకటి మనసుకు బాధకు గురిచేస్తుంది. ఆరోగ్యం విషయంలో అలక్ష్యం ఉండొద్దు. శివారాధనతో మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య : మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. భవిష్యత్ కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొననుండగా, పరమేశ్వరుడిని దర్శించుకుంటే తప్పక మేలు కలుగుతుంది.
తుల : చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. తీవ్ర నిరుత్సాహానికి కొన్ని విషయాలు గురిచేస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉండగా, ఇష్టదైవారాధనతో మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చికం : ఈ రాశివారికి దైవబలం ఎక్కువ. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఆశిస్తారు..ఇష్టదైవారాధనతో ఉత్తమ ఫలితాలు అందుకోగలుగుతారు.
ధనస్సు : కీలక విషయాల్లో కుటుంబీకుల ప్రోత్సాహం, సహకారం తప్పక ఉంటుంది. ఆత్మీయులతో గొడవలకు దిగకుండా ఉండాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దుర్గాదేవిని పూజించడం మంచిది
మకరం : సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో ముందడుగు వేసి, సమాజంలో మంచి పేరు, ప్రశంసలు పొందుతారు. ఇష్టదైవారాధన మరింత మేలు కలుగజేస్తుంది.
కుంభం : ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడమే కాక, ఆర్థిక అంశాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవ్వడమే కాక ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే శుభం కలుగక మానదు.
మీనం : కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తప్పక తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పక అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త లు వహించాలి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభం చేకూరుతుంది.