Telugu Flash News

Horoscope Today : 06-05-2023 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ఉద్యోగ రంగంలో ఆటంకాలు ఎదుర‌వుతాయి

horoscope 6th may

Horoscope Today, 6th may 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి అకాల భోజన‌వం వ‌ల‌న అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండొద్దు. చెడు పనులకు దూరంగా ఉండుట మంచిది. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాల శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించ‌డం వంటివి చేస్తారు.

వృషభం

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలవ‌డం వంటివి చేస్తారు.

మిథునం

ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా జ‌రుగుతాయి.. చెడు పనులకు దూరంగా ఉండుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి

కర్కాటకం

ఈ రాశి వారికి వ్య‌వసాయ రంగంలో లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నాల కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండుట ఉత్త‌మం. ఆకస్మిక భయం, ఆందోళన ఎక్కువ‌గా ఆవహిస్తాయి. శారీకంగా బలహీనప‌డ‌తారు.

సింహం

ఈ రాశి వారు మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండుట ఉత్త‌మం. నిరుత్సాహం చెందొద్దు.

కన్య

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించ‌డం మంచిది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండుట చేయాల్సి ఉంటుంది.. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాలి.

తుల

ఈ రాశికి చెందిన వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు క్ర‌మంగా దూరమవుతాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించుట చేయాల్సి ఉంటుంది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఎక్కువ‌.

వృశ్చికం

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవ‌ల‌సి ఉంటుంది.

ధనుస్సు

ఈ రాశి వారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఎక్కువ‌గా ఉంది.. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తించే అవ‌కాశం ఉంది. స్త్రీలు, పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.

మకరం

ఈ రాశి వారికి స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది .

కుంభం

ఈ రాశి వారికి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించ‌డం మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది.. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం చేసుకుంటే మంచిది.

మీనం

ఈ రాశి వారికి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తుతాయి.. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం ఉత్త‌మం.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

Exit mobile version