HomedevotionalHoroscope Today: 05-12-2022 సోమవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Horoscope Today: 05-12-2022 సోమవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today: మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఆశించిన ఫలితాలని ఇస్తాయి. ముఖ్యమైన పనుల్లో చాలాపురోగతి ఉంటుంది. కీర్తి కూడా పెరుగుతుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మొహమాటం వలన తీవ్రమైన‌ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలు పాటించాలి. కీలకమైన పనుల విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక పనులను విజయవంతంగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది.. ఒత్తిడిని జయించి ముందుకు సాగుతారు. శుభవార్తలు వింటారు. ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్ప‌డుతుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ పడక త‌ప్ప‌దు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం అవ‌స‌రం. అనవసర ధన వ్యయం చేసే అవకాశాలు ఎక్కువ‌. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తి చేసే ఛాన్స్ ఉంది.. అనవసర ధనవ్యయం చేసే అవకాశం కూడా ఎక్కువే.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక పరమైన ఆశించిన ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేయ‌గ‌లుగుతారు.. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అంచనాలను అందుకోగ‌లుగుతారు.

-Advertisement-

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సలహాలతో ముఖ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి న అవ‌స‌రం ఉంటుంది.. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఎక్కువ‌.

horoscope today

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఒత్తిడిని అధిగమించి కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను పొందుతారు. శుభకాలం న‌డుస్తుంది.. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్ప‌డే ఛాన్స్ ఉంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంగా అన్ని ప‌నులు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వ‌హించే ఛాన్స్ ఉంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.,. శుభఫలితాలను అందుకోగ‌లుగుతారు. . కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి.శారీరక శ్రమ అధికంగా పడాల్సి ఉంటుంది. మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టే పనుల్లో త‌ప్ప‌క‌ విజయాన్ని సొంతం చేసుకుంటారు. సంతోషాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంది.. అభివృద్ధికి సంబంధించిన వార్తల‌ను వింటారు. కుటుంబ వాతావరణం మంచిగా ఉంటుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News