Horoscope Today , 5th february 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Aries horoscope
ఈ రాశి వారికి నేడు అనుకూలముగా ఉన్నది. ఆర్ధికపరమైన లాభములు సౌఖ్యము కలుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Taurus horoscope
ఈ రాశి వారు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళు అధికమగు సూచనలు కనిపిస్తున్నాయి.. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. బృహస్పతి అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం పొందెదరు.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Gemini
ఈ రాశివారు ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. సౌఖ్యమును పొందెదరు. మిథున రాశి వారికి ఈ రోజు ధన లాభము కలుగును. అష్టమశని ప్రభావంచేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Cancer horoscope
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును.. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Leo
ఈ రాశి వారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Virgo
కన్య రాశి వారు అనుకున్న ప్రతి పని పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ వారం ఒత్తిళ్ళు తగ్గును. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందెదరు.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Libra horoscope
ఈ రాశి వారికి ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధించును. కుటుంబము నందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Scorpio
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలముగా లేదు. ఆరోగ్యమునందు సమస్యలు ఏర్పడును. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Saggitarius
ధనూ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. పనులయందు కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికి పూర్తి చేసెదరు. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. శని ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Capricorn horoscope
ఈ రాశి వారు ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. పనులయందు ఇబ్బందులు ఆటంకములు ఏర్పడును. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దత్తాత్రేయుని పూజించండి.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Aquarius
కుంభ రాశి వారికి ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు కలిగించును. ఆరోగ్యము అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారములో ఉన్న సమస్యలు తొలగును.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 5, 2023 Pisces horoscope
మీన రాశి వారిని కుటుంబమునందు సమస్యలు వేధించును. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలసి వచ్చును. కీర్తి , సౌఖ్యము కలుగును. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించడం మంచిది.
Also Read :
Jaggery face pack : బెల్లంతో ముఖంపై ముడతలు ఇలా పోగొట్టుకోండి..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ధరించే కాస్ట్లీ వాచ్ ల రేటు ఎంతో తెలుసా ?