HomedevotionalHoroscope Today: 04-12-2022 ఆదివారం రాశి ఫ‌లాలు..

Horoscope Today: 04-12-2022 ఆదివారం రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today:

మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం ఉత్త‌మం. ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.. సమయానికి తగిన విశ్రాంతి తీసుకోవాలి. ప్ర‌యాణాల వ‌ల‌న చాలా అల‌స‌ట చెందుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకునే ఛాన్స్ ఉంది.. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. సకాలంలో చేపట్టిన పనులను పుర్తి చేయాల్సి ఉంటుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి మించిన సహాయం అందుకుంటారు. శుభ సమయం. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.. శుభవార్తలు సంతోషాన్ని కలిగిస్తుంది. పని తీరుతో అధికారుల దృష్టిని ఆకర్షించే అవ‌కాశం ఉంది.. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు విందు,వినోదాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు ఎక్కువ‌గా చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు శ్రమకు తగిన ఫలితాలను అందుకునే ఛాన్స్ ఉంది. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలను పొందుతారు

-Advertisement-

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వృథా ప్రయాణాలు ఎక్కువ‌గా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవ‌డం మంచింది. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్నికలిగిస్తాయి.

horoscope today

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించే అవ‌కాశం ఉంది.. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లే అవ‌కాశం ఎక్కువ‌. మంచి ఫలితాలు అందుకుంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యయం పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి శుభవార్తలు కూడా వింటారు. మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. సంతోషంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే ఛాన్స్ ఉంటుంది.. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. బాధాకరమైన వార్తల‌ను వింటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఆకస్మికంగా ధనం చేతికి అందడం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రారంభించిన పనులల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసి ప్రశంసలను పొందుతారు. ప్రయాణలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్త వింటారు. ఇతరుల సహకారం ఎక్కువ‌గా లభిస్తుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో విజయాన్ని త్వ‌ర‌గా సొంతం చేసుకుంటారు. నిర్లక్ష్యాని వీడి ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News