HomehoroscopeHoroscope (04-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (04-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 4th February 2024: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఎక్కువ‌గా ఉంటుంది. రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు ద‌క్కే అవ‌కాశం ఉంది.. అన్నింటా విజయాన్ని సాధించి సంతోషంగా ఉంటారు.

వృషభం

ఈ రాశి వారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. శత్రుబాధలు పెద్ద‌గా ఉండవు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఆరోగ్య విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంట‌రు.

మిథునం

ఈ రాశి వారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం ఉత్త‌మం . కుటుంబ పరిస్థితులు ఎంతో సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు మ‌న‌ల్ని ఎంత‌గానో బాధిస్తాయి.

కర్కాటకం

ఈ రాశికి చెందిన విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఎంత‌గానో ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉండ‌డం ముఖ్యం.

సింహం

ఈ రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవ‌కాశం ఉంది.

-Advertisement-

horoscope today in telugu

కన్య

ఈ రాశికి చెందిన వారికి వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఛాన్స్ ఉంది. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్ప‌న‌సరి.

తుల

ఈ రాశికి చెందిన వారికి ప్రయ‌త్నకార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఏదో ఒక విష‌యం మ‌న‌ల్ని మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల ఏ మాత్రం ప‌నికిరాదు.

వృశ్చికం

ఈ రాశికి చెందిన వారు బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరే అవ‌కాశం ఉంది.. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు కూడా లభిస్తాయి.

ధనుస్సు

ఈ రాశి వారికి తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉండే అవ‌కాశం ఉంది.

మకరం

ఈ రాశికి చెందిన వారి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం ఉత్త‌మం.

కుంభం

ఈ రాశి వారు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకునే అవ‌కాశం ఉంది. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఎక్కువ‌. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే అవ‌కాశం ఉంది.

మీనం

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం ఉత్త‌మం. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో స్వ‌ల్పంగా మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేసే అవ‌కాశం ఉంది.

 

read more : 

 

చలికాలం పొడిచర్మం ఇబ్బందా..ఈ చిట్కాలు మీ కోసమే

రాగి సంగటి ని తయారు చేయండిలా..టేస్టీ టేస్టీ

బరువు తగ్గాలంటే ఈ స్నాక్స్ తినాల్సిందే.

ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే.

బరువు తగ్గేందుకు సీతాఫలం ఎంతో మేలు.

అందానికి ఆ నాలుగు విటమిన్లు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News