Homecinemahoroscope today telugu : 04-02-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today telugu : 04-02-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 4th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Aries horoscope

ఈ రాశి వారికి మంచి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ఇతరులపై పర్యవేక్షణ వంటివి అప్పజెప్పే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Taurus horoscope

ఈ రాశి వారికి ఆదాయంలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ. అనుకోకుండా బాగా దగ్గర వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Gemini

ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా కొంత‌ పుంజుకుంటారు. పొదుపు సూత్రాలు పాటిస్తారు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Cancer horoscope

ఈ రాశి వారికి కొందరు బంధువుల వల్ల ఆస్తి సంబంధమైన పేచీలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.. ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను ప్రశాంత వాతావరణం ఉంటుంది. స్నేహితుల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Leo

ఈ రాశి వారు విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆదాయం ఎక్కువ‌గా ఉంటుంది. అధికారుల నుంచి, సహచరుల నుంచి సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థిక సమస్యలు తల ఎత్తవచ్చు.

-Advertisement-

horoscope 2023కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Virgo

ఈ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు ఫలించి, ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Libra horoscope

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఉద్యోగ పరంగా మాత్రం ఎక్కువ‌గా కష్టపడాల్సి ఉంటుంది. అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. బదిలీకి అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. తోబుట్టువులకు బాగానే సహాయం చేస్తారు. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Scorpio

ఈ రాశి వారు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. ఉద్యోగపరంగా అధికారుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగులు వేయాలి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Saggitarius

ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు చక్కబడతాయి. బంధువులతో అపార్ధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కొద్దిగా రుణ బాధ తగ్గించుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక విషయాల్లో దుబారా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Aquarius

ఈ రాశి వారికి కుటుంబ వాతావరణంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగం మారటానికి ఇది స‌రైన‌ సమయం కాదు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 4, 2023 Pisces horoscope

ఈ రాశివారు ఉద్యోగంలో ఆవేశాల‌కి కాస్త‌ దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది స‌రైన‌ సమయం కాదు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచివి. కొందరు మిత్రుల వల్ల అపనిందలు పడాల్సి వస్తుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.

మరిన్ని వార్తలు చదవండి :

Hong Kong bumper offer : పర్యాటకులకు హాంకాంగ్‌ బొనాంజా.. ఉచితంగా విమాన టికెట్లు!

Baby in Brazil : బాలభీముడికి జన్మనిచ్చిన మహిళ! ఎంత బరువు ఉన్నాడంటే..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News