Homedevotionalhoroscope today telugu : 03-02-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today telugu : 03-02-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 3rd february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Aries horoscope

ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకోగ‌లుగుతారు.. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. బంధువుల విషయంలో ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. దీర్ఘకాలిక రోగులకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Taurus horoscope

ఈ రాశి వారి ఆదాయం లేదా సంపాదన పెరిగే సూచనలు ఉన్నాయి. అవసరాలకు తగ్గ డబ్బు అందే ఛాన్స్ ఉంది.. బంధుమిత్రులకు ఉదారంగా సహాయం చేస్తారు. పిల్లలకు ఉపయోగపడే పనులు ఎక్కువ‌గా చేస్తారు. ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Gemini

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఐటీ రంగం వారు ముందుకు దూసుకు పోతారు. ఆదాయపరంగా, లాభాలపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వ‌చ్చే ఛాన్స్ ఉంది.. ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఎక్కువ‌. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Cancer horoscope

ఈ రాశి వారికి అధికారుల నుంచి ఒత్తిడి, సహచరుల నుంచి కొద్దిపాటి సమస్యలు త‌లెత్తుతాయి.. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం ఎంతైన అవ‌స‌రం. వ్య‌స‌నాల వంటి వాటికి వెళ్లొద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Leo

ఈ రాశి వారికి భాగస్వాములతో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రస్తుతానికి మౌనం వహించడం మంచిది. ఆర్థిక పరిస్థితి యధాతధంగా ఉంటుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే ఛాన్స్ ఉంది.. చదువుల్లో పిల్లలు చక్కని విజయాలు సాధించ‌గ‌లుగుతారు.

-Advertisement-

horoscope 2023కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Virgo

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు వికటించే ప్రమాదం ఎక్కువ‌. బంధువుల సహాయంతో పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Libra horoscope

ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. మాట తొందర ఏ మాత్రం పనికిరాదు. ఆర్థికపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆహార విష‌యాల్లో నియమాలు పాటించాలి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Scorpio

ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు కొంతమేరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో సహచరులు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అప్రమత్తంగా ఉండటం ఎంతైన అవ‌స‌రం. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఆశాజనకంగానే ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువై ఇబ్బంది పడతారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Saggitarius

ఈ రాశి వారికి అదృష్ట యోగం పట్టడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగ పరంగా మంచి ఇంక్రిమెంట్ పొందే సూచనలు ఎక్కువ‌. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించడం జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Capricorn horoscope

ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Aquarius

ఈ రాశి వారికి ఆరోగ్యంలో తేడా వస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది..

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 3, 2023 Pisces horoscope

ఈ రాశి వారు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చు కుంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆరోగ్యం పైన ఓ కన్ను వేసి ఉంచాలి.

also read:

వారంలో నాలుగు రోజుల పనితో భారీ బెనిఫిట్స్‌.. అనేక దేశాల్లో ఫుల్‌ జోష్‌!

Viral video : అక్కడ డ్యాన్స్‌ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష.. ఇరాన్‌లో యువ జంటకు షాక్‌!

Vijay- Rashmika : ర‌ష్మిక‌, విజ‌య్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది..? మొన్న మాల్దీవులు.. ఇప్పుడు దుబాయ్ టూర్..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News