Homedevotionalhoroscope today telugu : 03-01-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today telugu : 03-01-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 3rd january 2023: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Aries horoscope

ఈ రాశి వారికి నేడు మంచి సమయంగా చెప్పాలి. నూతన కార్యాలకు శ్రీకారంచుట్టే అవ‌కాశం ఉంది.. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా ఏర్ప‌డుతుంది.. గొప్ప వ్యక్తిని కలుస్తారు. వీరు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ తొల‌గిపోతాయి..

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Taurus

ఈ రాశి వారికి కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవ‌కాశం ఉంది.. బంధు, మిత్రులతో కలహం పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం కూడా ఎక్కువ‌. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Gemini

ఈవారు కాస్త ఆచుతూచీ వ్యవహరించటం మంచిది. కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వ‌స్తుంటాయి. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి.

horoscope january 03 2023

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Cancer horoscope

ఈ రాశి వారు కుటుంబ విషయాలపై ఎంతో అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెర‌వేరే ఛాన్స్ ఉంది.. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం అవ‌స‌రం.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Leo

ఈ రాశి వారు ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ప‌డ‌తారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు వ‌హించాలి.. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుకూడా ఉంటాయి

-Advertisement-

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Virgo

ఈ రాశి వారి మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ ఎంతో అవసరం. ప్రయత్న కార్యాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు కూడా ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Libra horoscope

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. రుణలాభం కూడా పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి.. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Scorpio

ఈ రాశి వారు ఆకస్మిక ధనలాభంతో ఆనందంగానే ఉంటారు. శుభవార్తలు వింటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది.. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొన‌గ‌లుగుతారు.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Saggitarius

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నం కూడా సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకుండా. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Capricorn horoscope

ఈ రాశివారికి సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసంకూడా ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందే ఛాన్స్ ఉంటుంది . ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను ఎక్కువ‌గా గ్రహిస్తారు. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ స‌కాలంలో పూర్తి చేస్తారు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Aquarius

ఈ రాశి వారు  అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులని త‌ర‌చుగా కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : january 03, 2023 Pisces horoscope

ఈ రాశి వారి కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకార్యాలు కూడా ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు ఎంతో సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి.

also read :

Ramiz raza : ఎంత క‌ష్టం వ‌చ్చింది..ప్రాణం కాపాడుకోవ‌డానికి 1.65 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసిన మాజీ క్రికెట‌ర్

Pawan Kalyan: ఇది క‌దా ప‌వన్ మేనియా.. రీరిలీజ్‌ని కూడా ఇంత‌గా ఆద‌రిస్తారా…!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News