Horoscope Today, 2nd february 2023: Check astrological prediction for your zodiac signs
మేషం :
ఈ రాశి వారికి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం శుభపరిణామం.
వృషభం :
ఈ రాశి వారు పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందే అవకాశం ఉంది.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు తలెత్తుతాయి.
మిథునం :
ఈ రాశి వారు అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందే అవకాశం ఉంది. శత్రు బాధలుండవు. శుభవార్తలు కూడా వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందే ఛాన్స్ ఉంది.. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
కర్కాటకం :
ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు కూడా వింటారు.
సింహం :
ఈ రాశి వారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండుట మంచిది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభింంచే ఛాన్స్ ఉంది.
కన్య :
ఈ రాశి వారికి వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే ఛాన్స్ ఉంది.. పోట్లాటలకు దూరంగా ఉండడం అవసరం . అనారోగ్య బాధలను అధిగమించుటకు ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పడొద్దు..
తుల :
ఈ రాశి వారు అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు క్రమేపి దూరమవుతాయి.
వృశ్చికం :
ఈ రాశి వారికి నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
ధనుస్సు :
ఈ రాశికి చెందిన కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలినే ఛాన్స్ ఉంది.. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
మకరం :
ఈ రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వడం వలన ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు.
కుంభం :
ఈ రాశి వారు ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. మానసికానందాన్ని పొందుతారు.. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.
మీనం :
ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి.. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం కాస్త ఆలస్యంగా లభిస్తుంది.
also read news :
Vijaykanth: విజయ్ కాంత్‌ని చూసి ఆవేదన చెందుతున్న ఫ్యాన్స్..
Nayanthara: నయనతార కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందా.. ఆమె చెప్పిన నిజం ఏంటంటే..!
Naga Babu: పెళ్లయ్యాక వరుణ్ తేజ్‌ని దూరం పెడతానన్న నాగబాబు.. ఎందుకిలా?