Homedevotionalhoroscope today : 01-12-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 01-12-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 1st december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Aries horoscope

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడుతుంది.. అనారోగ్య బాధలు అధికంగా ఉంటాయి.. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసే ఛాన్స్ ఉంది. ప‌లు ఇబ్బందులు త‌లెత్తుతాయి.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Taurus

ఈ రాశి వారికి రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం అస్స‌లు పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు ఎక్కువ అవుతాయి.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Gemini

ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. . బంధు మిత్రులతో చాలా జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది.. కుటుంబ విషయాల్లో మార్పులు ఏర్ప‌డ‌తాయి.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Cancer horoscope

విందులు వినోదాలకు దూరంగా ఉంటారు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పుల‌ను కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు త‌లెత్తుతాయి.. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Leo

ఈ రాశి వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రుల‌ని ఎక్కువ‌ గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కారాలు ద‌క్కుతాయి. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.

-Advertisement-

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Virgo

ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకునే ఛాన్స్ ఉంది.. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలవ‌డం, సంతోషంగా ఉండ‌డం చేస్తారు. . క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేసే ప్ర‌య‌త్నం చేస్తారు.

horoscope today newsతుల రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Libra horoscope

ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు తొల‌గిపోతాయి.. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఏర్ప‌డ‌తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు వ‌హించాలి.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Scorpio

ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే ఛాన్స్ ఉంది.. తీర్థయాత్రల‌కు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Saggitarius

కొత్త కార్యాలు వీరు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పనిస‌రి.. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త ఉండ‌డం మంచిది.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Capricorn horoscope

ఈ రాశి వారు గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ‌. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Aquarius

బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త ప‌డాలి.. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం ఉంటుంది.. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమించే ప్ర‌య‌త్నం చేస్తారు.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 1, 2022 Pisces horoscope

ప్రయత్నకార్యాల్లో దిగ్విజయమైన విజ‌యాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతారు. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందం చెందుతారు.. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుట్టే ఛాన్స్ ఉంది.

also read news:

చలికాలంలో వేడి వేడి సోయా మసాలా పకోడీ రెడీ

Hybrid Technology Jobs : 2023 లో టెక్ హైబ్రిడ్ జాబ్స్ కు చిరునామా ఆ 10 నగరాలు!!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News