Telugu Flash News

Horoscope (01-05-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today in telugu

Horoscope Today, 1st may 2023: Check astrological prediction for your zodiac signs

మేష రాశి :

aries

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమవుతాయి.. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉంటాయి.

 

వృషభ రాశి :

taurus

ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు లాభములు కలుగును. వృషభరాశి వారు గొడవలు, వాగ్వివివాదములకు దూరంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండ‌డం మంచిది. అనారోగ్యం వ‌ల‌న కొంత ఇబ్బందులు ప‌డ‌తారు.

 

మిథున రాశి :

gemini

ఈ రాశివారికి శారీరక శ్రమ, మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించ‌డం ఉత్త‌మం. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. శివారాధన చేయటం వలన ఈ రోజు మంచి జ‌రుగుతుంది.

 

కర్కాటక రాశి :

Cancer

కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములయందు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతాయి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించ‌డం మంచిది. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వ‌హించాల్సి ఉంటుంది.

 

 

సింహ రాశి :

leo

ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాలు ఇబ్బంది పెడ‌తాయి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు జాగ్రత్త వహించవలసినటువంటి సమయము. స్త్రీలు కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వ‌హించ‌డం ఉత్త‌మం

 

కన్య రాశి :

virgo

ఈ రాశి వారికి కుటుంబమునందు కొంత చికాకులు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు లాభదాయకముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ప్రయాణములు లాభించును.

 

తులా రాశి :

libra

ఈ రాశి వారికి అన్ని విషయాల‌లో మంచే జ‌రుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగుతుంది. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు ఈ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సి ఉంటుంది.

 

వృశ్చిక రాశి :

Scorpio

ఈ రాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించ‌డం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగుతాయి.. విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి సమయము అని చెప్పాలి.

 

ధనుస్సు రాశి :

Saggitarius

ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము అనే చెప్పాలి.. చేసే ప‌నుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

 

మకర రాశి :

Capricorn

ఈ రాశి వారికి ఖర్చులు అధికమగును. కుటుంబమునందు సమస్యలు, వివాదాలు, మానసిక ఘర్షణలు అధికమవుతాయి. విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివుని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది.

 

కుంభ రాశి :

Aquarius

ఈ రాశి వారికి శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆర్ధిక విషయాలలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండ‌డం ఉత్త‌మం. కుటుంబ సమస్యలతో వాగ్వివిదాలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును. పనుల యందు ఆలస్యము. కుటుంబ వ్యవహారాలయందు కొంత చిరాకు ప‌డ‌తారు.

 

మీన రాశి :

Pisces

మీన రాశి వారికి శారీక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికమగును. మీనరాశివారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించ‌డం ఉత్తమం. ఈ రాశి వారికి ఖర్చులు అధికముగా అగును. రాజకీయ ఒత్తిళ్ళు కూడా అధికముగా ఉండును. విద్యార్థులకు కష్ట సమయము అనే చెప్పాలి. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వ‌హించ‌డం ఉత్త‌మం.

 

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

Exit mobile version