Telugu Flash News

horoscope today telugu : 01-02-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

today horoscope

Horoscope Today, 1st february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Aries horoscope

మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండ‌డం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Taurus horoscope

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసిక అలసట ఏర్పడుతుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు త‌లెత్తుతాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Gemini

ఈరోజు మీకు అంత అనుకూలంగానే ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము కలుగును. మీకృషి, శ్రమ చేత ధనపరమైన విషయాలలో లాభము పొందే అవ‌కాశం ఉంది. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణములో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Cancer horoscope

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పనిని అనుకూలంగా మ‌ల‌చుకుంటారు. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Leo

ఈ రాశి వారు నేడు అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఇబ్బందికరమైన ప‌రిస్థితులు త‌లెత్తే ఛాన్స్ ఉంది.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Virgo

ఈరోజు శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి పెరుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు ఎక్కువగా చేస్తారు.. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకుంటే చాలా మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉండును.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Libra horoscope

ఈరోజు ప్ర‌తి పనిని ఆచితూచి వ్యవహరించడం మంచిది. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం ఎంతో మంచిది . అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రుల హెల్ప్ చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Scorpio

ఈ రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు క‌లుగును. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. శత్రువులతో జాగ్రత్త వహించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం వృశ్చికరాశి వారు విష్ణు సహస్ర నామం చేయాలి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Saggitarius

ఈరోజు మీరు చేసే ప్రతీ పనిలో ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన వ‌ల‌న ఇబ్బందులు ప‌డ‌తారు.. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు క‌లుగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Capricorn horoscope

ఈ రాశి వారు ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Aquarius

ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించవలసిన సమయముంది. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం ఎంతో మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 1, 2023 Pisces horoscope

ఈరోజు కుటుంబ సౌఖ్యము కలుగును. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఉత్త‌మం. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త లు పాటించాలి.

also read: 

Union Budget 2023 Live Updates : కేంద్ర బడ్జెట్ 2023-24 లైవ్ అప్‌డేట్స్.. ఆదాయపు పన్ను పరిమితి రూ.7 లక్షలకు..

Singer Mano : సింగర్ మ‌నోకి కూడా మ‌ల్లెమాల‌తో గొడ‌వలా.. అందుకే జ‌బ‌ర్ధ‌స్త్‌ని వీడాడా.!

Ileana: ఆసుప‌త్రి బెడ్ పై ఇలియానా.. ఆహారం కూడా తిన‌లేని స్థితిలో ఉందా?

కేసీఆర్ గారు మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్టొద్దు : సింగ‌ర్ శ్రీరామ‌చంద్ర‌ 

 

Exit mobile version