Telugu Flash News

horoscope today telugu : 1-1-2023 ఆదివారం ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today in telugu

Horoscope Today, 1st january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Aries horoscope

ఈ రాశి వారు ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఒక విదేశీ సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పొదుపు ప్రయత్నాలు చేసే అవ‌కాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

వృషభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Taurus horoscope

ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సమస్య ఒకటి బంధువుల సహాయంతో పరిష్కారం చేసుకుంటారు.. పిల్లలు అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడ‌డం జ‌రుగుతుంది. ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది.

మిథునం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Gemini

ఈ రాశి వారి ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి కానీ, ఉద్యోగంలో మాత్రం ఒకటి రెండు చిన్న సమస్యలు తలెత్తే అవ‌కాశం ఉంది . అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగం మారాలని ప్రయత్నాలు సాగిస్తారు. కొందరు మిత్రులు తప్పుడు సలహాలతో త‌ప్పుదోవ ప‌ట్టే అవ‌కాశం ఉంది.

కర్కాటకం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1 , Cancer horoscope

ఈ రాశి వారు అదృష్ట యోగానికి, అధికార యోగానికి అవకాశం ఉంది. మిత్రులకు సహాయం చేస్తారు. బంధువులతో అపార్ధాలు తొలగిపోతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళతారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.

సింహం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Leo

ఈ రాశి వారికి కొంత రుణ సమస్య తగ్గుతుంది. ఇక రాదనుకున్న డబ్బు గురించి మంచి వార్త వింటారు. కుటుంబ పరంగా కొంత టెన్షన్స్ ఉంటాయి. బంధువులలో కొందరు మీ గురించి చెడు ప్రచారం ప్రారంభిస్తారు. స్నేహితులు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది.

కన్య – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Virgo

ఈ రాశి వారు కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికపరంగా ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఎక్కువ‌. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందవచ్చు

తుల – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Libra horoscope

ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలలో విశేష పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉద్యోగ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పవు. ఆర్థికంగా నిలకడగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఉంటంది.

వృశ్చికం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Scorpio

ఈ రాశికి చెందిన పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు.. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ సమస్య కొద్దిగా తగ్గుతుంది. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగుతుంది.

ధనస్సు – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Saggitarius

ఈ రాశి వారు గృహ, వాహన సౌఖ్యాలను అనుభవిస్తారు. విదేశాల నుంచి పిల్లలు చూడటానికి వస్తారు. మిత్రులు, బంధువులు మీ సలహాలను పాటిస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సమస్యలు ప‌రిష్కారం అవుతాయి.

మకరం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Capricorn horoscope

ఈ రాశి వారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరుల సమస్యల్లో తల దూర్చకపోవడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో కొంత ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల వారు లాభాలు గ‌డించే ఛాన్స్ ఉంది.

కుంభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Aquarius

ఈ రాశికి చెందిన వారు కొన్ని ముఖ్యమైన పనులు మీరు ఆశించిన విధంగా పూర్తి కాకపోవచ్చు. వ్యాపారంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. పొదుపు ప్రయత్నాలు చేసే అవ‌కాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. .

మీనం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 1, Pisces horoscope

ఈ రాశి వారు రాజకీయాల్లో కానీ, వ్యాపారంలో కానీ ప్రవేశించాలని ఆలోచిస్తారు. అవసరాలకు తగ్గ ఆదాయం ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరిగి చిక్కుల్లో పడతారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు..

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

Exit mobile version