Telugu Flash News

horoscope : 14-09-2023 ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే ?

14th september 2023 horoscope

14th september 2023 horoscope

Check your daily horoscope in telugu on 14th september 2023.

మేష రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆందోళనను దూరం చేసుకోవాలంటే ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. శారీరక అనారోగ్యంతో బాధపడుతుంటారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని నియంత్రించండి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు రుణాలు చేస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం ఆలస్యంగా అందుతుంది.

మిథున రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త ఇంటి పనులు చూసుకుంటారు. ఆకస్మిక ధనలాభాన్ని అనుభవిస్తారు. బంధువులు, స్నేహితులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు.దైవ దర్శనం చేసుకుంటారు.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారు పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి వృత్తిపరమైన గౌరవం, మర్యాద లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మీరు ఆనందాన్ని పొందుతారు. చిన్నపాటి అనారోగ్యాలు కలుగుతాయి.

సింహ రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారు వ్యాపారంలో విశేష లాభం పొందుతారు. మంచి వ్యక్తులతో స్నేహం చేయండి. ఆనందం ప్రతిచోటా ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్యా రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు చేస్తారు.

తులా రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారికి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆకస్మిక ధన నష్టానికి అవకాశం ఉంది. బంధు మిత్రులతో విద్వేషాలు రాకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారి కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. గతంలో వాయిదా పడిన పనులన్నీ పూర్తవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. స్థిర నివాసం ఏర్పడుతుంది. మీరు వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. కష్టాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను అర్థం చేసుకుంటారు.

ధనుస్సు రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారికి గౌరవానికి లోటు లేదు. అనవసర ఖర్చులు ఉంటాయి. వృధా ప్రయాణాలు అధికంగా చేస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుస్తోంది. బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.

మకర రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారు వృత్తిపరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీల విషయాలలో సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధన నష్టానికి అవకాశం ఉంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ సందర్భంలో, నిరుత్సాహం పనికిరాదు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్యం కలుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తపడటం మంచిది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీన రాశి ఈరోజు ఫలితాలు 14-09-2023

ఈ రోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి. స్థాన చలన సంకేతాలు ఉన్నాయి. శుభకార్యాల అంశంగా ధన వ్యయం పెరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త పడాలి.

also read :

turmeric milk :పసుపు పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందా ?

nipah virus : నిపా వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు మరియు నివారణ చిట్కాలు తెలుసుకోండి!!

 

 

Exit mobile version