dandruff : మగవారికైనా, ఆడవారికైనా చుండ్రు సమస్య వచ్చిందంటే.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఆ చుండ్రు చికాకు పెడుతుంటే ఏమి చేయాలో.. ఈ క్రింది టిప్స్ పాటించి చూద్దాం..
- గ్లిజరిన్ తలకు పట్టించి, మర్దన చేసి నాలుగు, అయిదు గంటలు ఆగిన తర్వాత తలస్నానం చెయ్యాలి.
- పెరుగును తలకు పట్టించి, రెండు గంటల తర్వాత స్నానం చేస్తే చాలు.
- కోడిగుడ్డు సొనని గిలకొట్టి దాన్ని తలకు పట్టించి రెండు గంటల తర్వాత స్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తే !
- కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ రాయటం ద్వారా కూడా చుండ్రును నివారించవచ్చు.
- వేపాకు వేసి కాసిన నీటితో తలస్నానం చేసినా చుండ్రు మటుమాయం.
- చుండ్రు వలన వెంట్రుకలు రాలిపోతుంటే కొబ్బరి కాల్చి ప్రతిరోజూ ఆ ప్రదేశంలో పూస్తుంటే వెంట్రుకలు తిరిగి వస్తాయి. దీనికోసం హోమియో ఆయిల్ కూడా ఉంటుంది.
పై చిట్కాలను ఒకటి రెండు సార్లు వాడి ఆపకుండా అయిదారు నెలలు క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ఈ పద్ధతులు పాటించాక కుంకుడురసంతోనే తలస్నానం చెయ్యా లన్నది మాత్రం మరువకండి.
మరిన్ని వార్తలు చదవండి :
pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా తగ్గించుకోండి..!
Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..
how to get soft feet : మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!