Telugu Flash News

Johnny Depp : పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ హీరో ‘జానీ డెప్’ గురించి తెలుసుకోండి..

johnny deep

johnny deep

జానీ డెప్ ( Johnny Depp) 1963,జూన్ 9న ఓవెన్స్బోరో లోని కెంటుకీలో(Owensboro, Kentucky) సివిల్ ఇంజనీర్ అయిన జాన్ క్రిస్టోఫర్ డెప్, బెట్టీ సూ డెప్ లకి జన్మించాడు.

జానీ డెప్ కుటుంబం తన చిన్నతనంలో చాలా సార్లు,చాలా ఊర్లు మారుతూ వచ్చి చివరిగా ఫ్లోరిడాలోని మిరమర్ లో స్థిరపడ్డారు.ఆ తరువాత 1978 జానీ తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇక చదువు విషయానికీ వస్తే మొదటి నుంచి బానే రాణిస్తూ వచ్చిన తనకు 12 ఏళ్ల వయసులో తల్లి బెట్టీ ఒక గిటార్ ని కొనివ్వడంతో తొలి సారిగా తన అడుగులు మ్యూజిక్ వైపు పడ్డాయి.

అలా మ్యూజిక్ గురించి తెలుసుకుంటూ, దానిపై ఇష్టాన్ని పెంచుకున్న జానీ 16 ఏళ్ల వయసులో రాక్ మ్యూజీషియన్ అవ్వడం కోసం చదువును మధ్యలోనే ఆపేసి మ్యూజిక్ బ్యాండ్ లో ఒకడిగా చేరాడు.

అయితే చదువు ఆపేయడం తప్పని తెలుసుకున్న జానీ రెండు వారాల తరువాత మళ్ళీ స్కూల్ కి వెళ్దామని ప్రయత్నించినప్పటికీ స్కూల్ ప్రిన్సిపాల్ తన ఆశయం వైపు వెళ్ళమని చెప్పడంతో ఆగిపోయాడు.

అలా అందరి సహాయంతో మ్యూజీషియన్ గా మారిన జానీ డెప్ ఫ్లోరిడాలో మంచి బ్యాండ్ గా పేరు తెచ్చుకుని, రికార్డు డీల్ కోసం లాస్ ఏంజెల్స్ కి మకాం మార్చాడు.

లాస్ ఏంజెల్స్ కి వెళ్ళిన వాళ్ళ బ్యాండ్ విడిపోవడంతో బ్యాండ్ లోని వారంతా చెల్లాచెదురు అయ్యారు. ఆ తరువాత 1983లో జానీ డెప్ అన్నే అలిసన్ ను వివాహమాడాడు. 1985 లో విడాకులు తీసుకున్నారు.

జానీ డెప్ (Johnny Depp) సినీ ప్రయాణం:

అలా లాస్ ఏంజెల్స్ కి వెళ్లి వివాహమాడిన తరువాత అలిసన్ స్నేహితుడు, నటుడు అయిన నికోలస్ ను కలవగా అతను డెప్ ను సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేయమని చెప్పడంతో తొలి సారిగా డెప్ ఆలోచన సినిమాల వైపు మళ్ళింది.

నికోలస్ సూచనలతో సినిమాల వైపు వచ్చిన జానీ 1984 లో ఏ నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్(A Nightmare on Elm Street) సినిమాతో తొలి సారిగా నటుడిగా మారాడు.

1985 లో జానీ డెప్ అన్నే అలిసన్ విడాకులు తీసుకున్నారు.

1988 లో ప్లాటూన్ సినిమాలో కూడా కనిపించాడు.1990 లో 21 జంప్ స్ట్రీట్ (21 jump street) సీరీస్ లో కనిపించి టీన్ ఐడల్ గా(teen idol) ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆ తరువాత క్రై (cry), వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్ (What’s Eating Gilbert Grape), బెన్నీ అండ్ జూన్ (Benny and joon),డెడ్ మాన్(dead man) లాంటి సినిమాలలో కనిపించి స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు.

2000లో వాల్ట్ డిస్నీ తో పైరేట్స్ ఆఫ్ ది కర్రేబియన్ సినిమాలో కెప్టెన్ జాక్ స్పారో (jack sparrow) పాత్రలో కనిపించి మెప్పించడమే కాక కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఫైండింగ్ నెవర్ లాండ్(Finding never land),చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ( charlie and the chocolate factory), విల్లీ వాంకా(Willy wonka) సినిమాలతో మంచి నటుడిగా స్థిర పడ్డాడు.

ఈ సినిమాలతో జానీ డెప్ క్రేజ్ ,స్థాయి పెరగడంతో 2012లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు డెప్ ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునిరేషన్ తీసుకుంటున్న నటుడిగా పేర్కొన్నారు.

జానీ డెప్ తన సినిమాలలో చూపించిన అద్భుతమైన నటనకు గాను గోల్డెన్ గ్లోబ్,ఎమ్ టీవీ,ఎమ్ టీవీ జనరేషన్ లాంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుని అందర్నీ ప్రశంసలను అందుకున్నాడు.

విడాకులు ఒక సంచలనం

ఇక డెప్ వ్యక్తి గత జీవితానికి వస్తే 2015 లో నటి ఆంబర్ హెడ్ ని పెళ్లి చేసుకోగా వాళ్ళిద్దరు రెండేళ్ల తరువాత 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే జానీ డెప్ ఆంబర్ ని హింసిస్తున్నాడని ఆంబర్ హెడ్ ఆరోపించడంతో వీళ్ళ విడాకులు ఒక సంచలనంగా మారింది.అప్పట్లో దీనిపై ఒక కేసు కూడా నడవగా జానీ డెప్ నిందుతుడిగా తీర్పు కూడా వెల్లు వడింది.

johnny depp amber heard

ఈ విషయం పై 2022లో మరో సారి జానీ డెప్,ఆంబర్ హెడ్ కోర్టు మెట్లు ఎక్కగా ఈ సారి జానీ డెప్ అమాయకుడని తేలి తీర్పు అతనికి అనుకూలంగా రావడంతో వీరి విడాకులు నెట్టింట్లోనూ,న్యూస్ పేపర్లలోనూ సంచలనంగా మారింది.

మరిన్ని వార్తలు చదవండి :

Rishabh Pant : కోలుకున్న పంత్.. కారు ప్ర‌మాదానికి ఇది అస‌లు కార‌ణం అని చెప్పిన రిష‌బ్

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ హిల్ స్టేషన్ లకి ఎప్పుడైనా వెళ్ళారా..

Varisu Audio Launch : Vijay – Rashmika Madanna Photos

NTR: ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ నా కాళ్లు ప‌ట్టుకున్నాడు అని చెప్పిన సీనియ‌ర్ న‌టి

 

Exit mobile version