Telugu Flash News

karnataka shakti scheme : ఉచిత ప్రయాణం.. ప్రైవేట్‌ బస్సులకు కష్టకాలం..!

karnataka shakti scheme private bus owners strike

karnataka shakti scheme : ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యోజన పథకం తమను పూర్తిగా రోడ్డున పడేసిందని పలువురు ప్రైవేట్ బస్సు యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి ప్రైవేట్ బస్సుల్లో వెళ్లేవారు.

ప్రస్తుతం ఉచిత ప్రయాణం అని ప్రకటించడంతో మహిళలు ఆర్టీసీ బస్సు కోసం చాలా సేపు నిరీక్షిస్తున్నారు. దీంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేమని ప్రైవేట్ బస్సు నిర్వాహకులు చెబుతున్నారు. బస్సులు అమ్మినా కొనేవారు లేరు. రెండేళ్ల క్రితం కరోనా వల్ల బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

karnataka shakti scheme

తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో, సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలో తెలియక బస్సు యజమానులు నిరాశలో ఉన్నారు. మూడు నెలలకు 7,952 రోడ్డు పన్ను, రూ. 72,202 ఇన్సూరెన్స్ ప్రీమియం, ఎఫ్‌సీలు చెల్లించాలని, వ్యాపారం లేనప్పుడు ఇంత మొత్తం ఎలా చెల్లిస్తారని బస్సు నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

యజమానులే కాదు బస్టాండుల్లో టిక్కెట్లు ఇచ్చే లోడర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, వారి కుటుంబాలు వీధిన పడాల్సి వస్తోంది. పాతకాలం నుంచి బస్సులపైనే జీవనం గడుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ట్రావెల్స్‌ నిర్వాహకులను షాక్‌కు గురిచేస్తోంది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో ప్రైవేటు బస్సులలో ఎక్కేవారు లేకపోవడం తో ఎలా నడపాలో అర్థం కావడం లేదు. జీతాలు చెల్లించలేకపోతున్నామని బస్సు యజమాని ప్రదీప్ వాపోయాడు.

అలాగే బస్ ఏజెంట్ నగేష్ మాట్లాడుతూ నాలుగైదు బస్టాండ్లలో టిక్కెట్లు విక్రయిస్తూ గతంలో రూ. 200 నుంచి 300 సంపాదించే మాకు, ప్రభుత్వం ఇప్పుడు మా పొట్ట కొట్టింది. ప్రయాణికులు లేక, కమీషన్ లేక, కుటుంబాలను ఎలా పోషించుకుంటాం. గౌరిబిదనూరు బస్టాండ్‌లో 15 మందికి పైగా ఏజెంట్లు ఉన్నారు.

read more :

Kia Seltos 2023 : జులై 4 న కొత్త ఫీచర్లతో రాబోతున్న కియా కారు..

Adipurush 4th Day Collections : కుప్పకూలిన ఆదిపురుష్ కలెక్షన్లు !?

 

 

Exit mobile version