HomecinemaHIT 2 telugu movie review : హిట్ 2 తెలుగు మూవీ రివ్యూ

HIT 2 telugu movie review : హిట్ 2 తెలుగు మూవీ రివ్యూ

Telugu Flash News

HIT 2 telugu movie review

సినిమా పేరు..హిట్ 2
దర్శకుడు.. శైలేష్ కొలను
నటీనటులు.. అడివి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్
నిర్మాతలు.. ప్రశాంతి తిపిరనేని, నాని
సంగీతం.. ఎం.ఎం.శ్రీలేఖ. , సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ.. ఎస్.మణికందన్

HIT 2 telugu movie Rating : 3.5/5 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోల్లో అడవి శేషు కూడా ఒకరు అనే చెప్పాలి. డిఫరెంట్ సినిమాలతో టాలెంటెడ్ హీరోగా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న‌ అడవి శేషు హీరోగా హిట్ -2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శైలేష్ కొలను హిట్ సినిమాను ఒక సిరీస్ గా మొత్తం ఏడు సినిమాలను ప్లాన్ చేశాడు. సీరియల్ కిల్లర్ తరహాలో హిట్ సిరీస్ ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించారు. నేడు విడుద‌లైన హిట్ 2 క‌థ విష‌యానికి వ‌స్తే…

క‌థ‌:

కెడి(అడివి శేష్) వైజాగ్‌లో ఒక కూల్ పోలీస్ అధికారి కాగా, అతను ఎప్పుడూ తనను ఛాలెంజ్ చేసే కేసులను ఛేదించడానికి ఆస‌క్తి చూపుతుంటాడు. ఏ కేసునైన ఇట్టే ప‌రిష్క‌రించ‌డంలో కేడి సిద్ధ‌హ‌స్తున్నాడు. సంజన కేసు విష‌యంలో మాత్రం చాలా సవాళ్ల‌ను ఎదుర్కొంటాడు. అయితే ద‌ర్యాప్తు స‌మ‌యంలో హంతకుడి గురించి అత‌ను తెలుసుకున్న విష‌యాల వ‌ల‌న క‌థ మ‌లుపు తిరుగుతుంది. మ‌రి చివ‌ర‌కి సంజ‌న కేసుని కేడీ సాల్వ్ చేస్తాడా, హంతకుడు దొర‌కుతాడా అన్న‌ది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప‌ర్‌ఫార్మెన్స్:

కెడి పాత్రలో అడివి శేష్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, అత‌ను కూల్ పోలీస్ అధికారిగా బాగా చేసాడు, అయితే ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపించాడు. ఇక మీనాక్షి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కలిగి ఉంది కానీ నటనకు స్కోప్ అయితే లేదు, మిగిలిన తారాగణం రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ వారి వారి పాత్ర‌లకు న్యాయం చేశారు.

ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే హిట్ ద‌ర్శ‌కుడు శైలేష్ కొలను సెకండ్ పార్ట్‌లో కొత్త సన్నివేశాలతో సినిమాకు విలక్షణమైన టచ్ ఇచ్చాడు . క‌థ పాతే అయిన‌ప్ప‌టికీ కొత్త సన్నివేశాలతో మన‌ల్ని నిమగ్నం చేసాడు, అతను కథకోసం ఎంత పరిశోధించాడో స్పష్టంగా తేర మీద కనిపిస్తుంది, ఎస్.మణికందన్ తన విజువల్స్‌తో బాగానే ఆకట్టుకున్నాడు. ఎంఎం శ్రీ లేఖ, సురేష్ బొబ్బిలి పాటలు అంతగా ఆకట్టుకోవ‌డం లేదు. స్టీవర్ట్ ఎదూరి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

-Advertisement-

ప్లస్ పాయింట్లు:

కొత్త సన్నివేశాలు
ఇంటెన్సిటీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్లు:

స్లో నేరేషన్
ఎమోషన్ అంత‌గా లేకపోవడం

ఫైన‌ల్‌:

హిట్ -ది ఫస్ట్ కేస్ సీట్ కి అతుక్కుపోయాలా చేసి చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది . రెండో పార్ట్ విష‌యానికి వ‌స్తే ఇందులో క‌థ ని ఎస్టాబ్లిష్ చేస్తూ సినిమా కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ తరువాయి భాగం సినిమాపై ఉత్సుకతని పెంచుతుంది. సెకండాఫ్‌లో క‌థ‌నం వేగం పెరుగుతుంది. సినిమాలో కొన్ని బ్లాక్‌లు మినహా సినిమా మొత్తం ఎంగేజింగ్‌గా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాల‌ని ఇష్ట‌ప‌డేవారికి ఈ మూవీ త‌ప్ప‌క న‌చ్చుతుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News