కొత్త సంవత్సరం రానే వచ్చింది.ఈ ఏడాదిని కూడా అందరూ కొత్త వెలుగులతో,కోటి ఆశలతో ఎప్పటిలాగే ఆహ్వానించారు.ఆయితే వెకేషన్ కోసం ఈ ఏడాది ఎవరు ఎక్కడికి వెళ్దాం అనుకున్నా సరే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ హిల్ స్టేషన్ లకి ఇప్పటి వరకు మీరు వెళ్ళకపోతే ఒకసారి వెళ్లి వచ్చేయండి.
1.లంబసింగి
విశాఖపట్నంలో ఉన్న ఈ ప్రదేశంలోని పచ్చదనానికీ,వీచే చల్లని గాలులకి ఇక్కడకు వెళ్లిన పర్యాటకులు మైమరచిపోతారు.దక్షణ భారత దేశం అంతటిలోనూ నక్షత్రాలను కనులకు విందుగా చూడ దగిన ప్రదేశమైన ఈ లంబసింగికి చుట్టు పక్కల ఎక్కువ అడవి ప్రాతం ఉండడమూ,ఈ హిల్ స్టేషన్ కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇక్కడ సీతా కాలంలో ఉండే వాతావరణం చల్లగా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందట.
2.అరకు వాలీ
విశాఖ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అరకు వాలీ ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తూ అక్కడికి వచ్చే పర్యాటకులకు హాట్ ఎయిర్బలూనింగ్(hot air ballooning),వాటర్ ఫాల్స్(water falls),ఫారెస్ట్ ట్రెక్కింగ్(Forest trekking) మరియు కేవ్ ఎక్స్ప్ల రేషన్(cave exploration) లాంటి ఎన్నో మంచి అనుభూతులను అందిస్తుంది.ఇంకో విశేషం ఏంటంటే ఎంతో ప్రాముఖ్యత చెందిన బొర్రా కేవ్స్ కూడా ఈ ప్రదేశానికి చెందినవే.ఇలాంటి మంచి ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వీక్షించి చూడాలి.అలానే వాటి అందాలని అనుభూతి చెంది తీరాలి.కుదిరితే మీరు కూడా వెళ్ళండి. ఒక సారి చూసి వచ్చేయండి.
3.మారేడుమిల్లీ
దక్షణ భారత దేశంలో పర్యాటకుని మనసును కట్టి పడేసే అందాలు కలిగిన హిల్ స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది మారేడుమిల్లీ హిల్ స్టేషనే అని చెప్పాలి.ఈ ప్రదేశానికి చుట్టు పక్కల ఉండే పచ్చని చెట్లు,వెదురు కర్రలూ ఇక్కడికి వచ్చే వారి మనసుల్లో తమ అందాలతో మంచి అనుభూతిని నిలుపుతాయి.అదే విధంగా ఇక్కడ వయ్యారంగా వంపులు తిరిగే రోడ్లు,ఈ ప్రాంతానికి చుట్టు పక్కల ఉండే రిసార్ట్లు (resorts) ఈ మారేడు మిల్లీ హిల్ స్టేషన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
4.పాపి కొండలు
రాజమండ్రీ జిల్లాకు చెందిన ఈ ప్రాంతం కూడా పైన చెప్పిన విధంగా మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాలలోకే వస్తుంది.అదే విధంగా దీనికి పక్కనే పారుతూ ఉండే గోదావరి నది,ఆ నదిలో ప్రయాణిస్తుండే పడవలు కూడా ఈ పాపి కొండలకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తూ వస్తున్నాయి.ఈ పాపి కొండలు ఒక గిరిజన ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చే చాలా మంది గిరిజనుల ఆతిథ్యాన్ని స్వీకరించి,వాటిని ఒకసారైనా తమ జీవితంలో అనుభూతి చెందాలని కోరుకుంటుంటారు.కొన్ని సార్లు ఆ కోరికలు తీరతాయి కూడా.
ఇలా పర్యాటకులు వీక్షించగల హిల్ స్టేషన్లు మన ఆంధ్ర ప్రదేశ్ లో చాలానే ఉన్నాయి. మరి ఈ హిల్ స్టేషన్లకి మీరు వెళ్ళారా…..వెళ్ళకపోతే ఒక సారి వెళ్లి వచ్చేయండి….
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు