Parineeti Chopra: ఇటీవలి కాలంలో అందాల భామలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కత్రీనా కైఫ్, కియారా అద్వానీ, ఆలియా భట్, అతియా శెట్టిలతో పాటుగా మరికొంత మంది భామలు తమకు నచ్చిన వారితో పెళ్లి పీటలెక్కారు.
ఇక బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో పరిణితీ చోప్రా కూడా ఒకరుగా ఉంది. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ పంజాబీ బ్యూటీ.. తన అందంతో ఇండస్ట్రీని అల్లాడిస్తుంది.
ఇప్పటికే పలు హిట్ చిత్రాలతో మంచి జోరుమీదున్న ఈ భామ.. వరుసగా సినిమాలు చేస్తూ.. క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.
ప్రస్తుతం అయితే నేను సింగిల్ గానే ఉన్నాను. త్వరలో మింగిల్ అవ్వాలని ఎంతో ఆశగా చూస్తున్నాను. ఆలియా, కియారా, అతియా శెట్టీల పెళ్లి ఫోటోలు చూస్తుంటే నాకూ పెళ్లి చేసుకోవాలని ఆసక్తి కలుగుతుంది.
అనంతరం ఫ్యాన్స్ ను ఉద్దేశించి ‘నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మంచి అబ్బాయి ఉంటే చూడండి’ అంటూ నవ్వుతూ.. కుర్రాళ్లకు వలపు వల విసిరి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది పరిణితీ.
also read :
Rashmi Gautam : రష్మి గౌతమ్ అందాల విందు.. కన్నుల పండుగే..
Cracked Heels : పాదాల పగుళ్లకు పరిష్కారం ఏంటి? బెస్ట్ చిట్కాలు ఇవే!