Telugu Flash News

Priyanka Chopra : బాత్‌రూంలో కూర్చొని అన్నం తినేదాన్ని..

priyanka chopra citadel promotions interview

Priyanka Chopra: గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకొని ఆ త‌ర్వాత హాలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్క‌డ కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా రీసెంట్‌గా హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది.

అమెజాన్ ప్రైమ్ లో ఈమధ్యనే స్ట్రీమింగ్ కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా, ప్రియాంక ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప‌డ్డ బాధ‌లు గురించి వివ‌రించి అంద‌రికి షాక్ ఇచ్చింది. అమెరికా లో స్కూలింగ్ చేస్తున్న సమయం లో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాను.

ఎవరితో స్నేహం చెయ్యాలి అనేది తెలిసేది కాదు, క్యాంటిన్ కి వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో అర్ధం అయ్యేది కాదు. వెడ్డింగ్ మెషిన్ నుండి స్నాక్స్ తీసుకొని ఎవరికీ కనపడకుండా బాత్రూం లోకి వెళ్లి అక్క‌డ కూర్చిని తినే దానిని. త‌ర్వాత క్లాస్ రూమ్‌కి వెళ్లాను. నాకున్న భ‌యం వ‌ల‌న అలా చేశాను.

అయితే నాలుగు వారాల పాటు అక్కడ జరుగుతున్నవి గమనించాక‌ నాలో ధైర్యం పెరిగింది అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. స్కూల్ లో ఉన్న తోటి స్టూడెంట్స్ తో స్నేహం చెయ్యడానికి న‌న్ను నేను ఎంతో మార్చుకోవ‌ల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేసింది ప్రియాంక‌.

also read :

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

Exit mobile version