హీరోయిన్ సుకన్య 90 ల సమయంలో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.‘పెద్దరికం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన సుకన్య.. ఈ చిత్రంతో మంచి క్రేజ్ దక్కించుకుంది . రాజశేఖర్ తో ‘అమ్మ కొడుకు’ నే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అయితే 1996 లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ గా మార్చిందనే చెప్పాలి. ఆ చిత్రంలో పెద్ద కమల్ హాసన్ సరసన.. వృద్ధురాలి పాత్రలో సుకన్య పలికించిన హావా భావాలు ప్రతి ఒక్కరి మనసులు దోచేశాయి. నటి సుకన్య గురించి సినీ పరిశ్రమలో తెలియనివారు లేరు.అయితే ఈమె తన సినిమాలతో కంటే తన జీవితంలో చోటు చేసుకున్నటువంటి వివాదాల కారణంగా ఎక్కువగా వార్తలలో నిలిచింది.
హీరోయిన్ సుకన్య అంత పని చేసిందా?
సినిమాల్లోకి వచ్చిన తర్వాత సౌత్ ఇండియాలో దాదాపు 200 సినిమాల వరకు నటించింది. కేవలం నటిగానే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది. అయితే ఆమె సినిమాల మీద ఉన్న పిచ్చితో ఏకంగా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకుందనే టాక్ ఉంది.. కెరీర్ డౌన్ ఫాల్ అయిన సమయంలో అంటే 2002లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీధరన్ బాలాజీని అమెరికాలో వెంకటెశ్వర ఆలయంలో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక కొన్నాళ్ల పాటు ఇద్దరు ఎంతో అనోన్యంగా ఉండేవారు. కానీ ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆనందం అనే సీరియల్ లో మెయిన్ లీడ్ కోసం అవకాశం రావడంతో, ఆమె కెరీర్ పైన ఉన్న పిచ్చి ప్రేమతో భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత ఇండియా కూడా వచ్చేసింది.
ఇక సీరియల్‌కి మంచి గుర్తింపు రావడం, ఆమె ఫేమస్ కావడం, ఇదే అదనుగా భర్తపై వేధింపుల కేసు పెట్టి విడాకులు కోరింది. దాంతో నోటీసు అందుకున్న శ్రీధర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. పరుగున ఇండియా కి వచ్చిన శ్రీధర్ సుకన్య అబార్షన్ చేయించుకున్న విషయాన్నీ మీడియా ముందు బహిర్గతం చేశాడు. సుకన్య ప్రాస్టిట్యూషన్ కేసులో రెండు మూడుసార్లు చిక్కుకున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అవకాశాల కోసం సినీ పరిశ్రమకు వచ్చేటటువంటి యువతీయువకులను మెల్లగా వ్యభిచార కూపంలోకి కూడా దింపినట్టు ఆమెపై పలు ఆరోపణలు కూడా వినిపించాయి.
read more news:
KL Rahul: బంగ్లాదేశ్ మ్యాచ్‌తో ఫామ్‌లోకి కేఎల్ రాహుల్.. ప్రశాంతంగా నిద్రపోతానన్న టీమిండియా ఓపెనర్
Bigg Boss 6: బిగ్ బాస్ హౌజ్‌లో ఘోరాతి ఘోరాలు.. శ్రీహాన్‌ని ఇనయ అంత మాట అనేసిందేంటి ?