HomecinemaTrivikram: త్రివిక్ర‌మ్‌తో సినిమా అంటే భ‌య‌పడుతున్న హీరోలు.. అందుకు కార‌ణం ఏంటంటే..!

Trivikram: త్రివిక్ర‌మ్‌తో సినిమా అంటే భ‌య‌పడుతున్న హీరోలు.. అందుకు కార‌ణం ఏంటంటే..!

Telugu Flash News

Trivikram: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ర‌చ‌యిత నుండి ద‌ర్శ‌కుడిగా మారి అద్భుత‌మైన సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రు కాగా, బ‌డా హీరోల‌తోనే సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. త్రివిక్ర‌మ్ సినిమాల‌తో మంచి హిట్స్ కొట్టి టాప్ హీరోలుగా మారిన వారు ఉన్నారు. చివ‌రిగా అల్లు అర్జున్‌తో అల వైకుంఠ‌పురంలో సినిమా చేసిన త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం  మ‌హేష్ బాబు తో ఓ చిత్రం చేస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా రూపొందుతున్న‌ నేప‌థ్యంలో ఈ మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

సెంటిమెంట్ భ‌యం..

అయితే త్రివిక్ర‌మ్‌తో సినిమాలు చేసిన ప్రతి స్టార్ హీరో కి మంచి మంచి హిట్స్ ద‌క్కాయి. కాక‌పోతే ఓ సెంటిమెంట్ ప్ర‌కారం ఆయ‌న‌తో సినిమా చేయాలంటేనే హీరోలు బ‌య‌ప‌డుతున్నారు. త్రివిక్ర‌మ్‌తో సినిమాలు తీస్తే వారి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు అనే సెంటిమెంట్ భ‌య‌పెట్టిస్తుంది.

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేసిన తొలి సినిమా ‘జల్సా’ కాగా, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ తండ్రి వెంకటరావు చనిపోయారు..తండ్రి మరణం నుండి పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి చాలా సమయమే పట్ట‌గా, కొంతకాలం గ్యాప్ తీసుకొని మిగిలిన షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేశాడు ప‌వ‌న్.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ఎన్టీఆర్ తండ్రి హరి కృష్ణ రోడ్డు ప్రమాదం లో క‌న్నుమూసారు.

ఇక మహేష్ బాబు తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగానే మహేష్ తల్లి ఇందిరా దేవి గారు కన్నుమూశారు..ఇక త్వ‌ర‌లో రెండవ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అనుకునేలోపు మ‌హేష్ తండ్రి కృష్ణ కన్నుమూశారు.. కృష్ణ మ‌ర‌ణంతో మ‌హేష్ చాలా బాధ‌లో ఉన్నారు.

ఈ ఏడాదిలో మ‌హేష్ ఇంట్లో ఇది మూడో మ‌ర‌ణం కావ‌డంతో ఆయ‌న చాలా డిప్రెష‌న్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి పూర్తిగా కోలుకొని షూటింగ్ ఎప్పుడు చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. అయితే యాదృశ్చికంగా త్రివిక్ర‌మ్ తో ప‌ని చేస్తున్న హీరోల ఇంట్లో ఇలా విషాద ఛాయ‌లు అలుముకుంటున్నాయి.

-Advertisement-

also read news:  

horoscope : 18-11-2022 శుక్రవారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News