Viral Video: కరెంట్ తీగ.. చూడ్డానికి చాలా సన్నగా ఉంటుంది. టచ్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరెంట్ వైర్లకు తగిలి నిత్యం ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే తాజాగా ఓ హెలికాఫ్టర్ హైటెన్షన్ వైర్లకు తగలగా, అందులోని వారు అదృష్టవశాత్తు ప్రమాదం నుండి బయటపడ్డారు. పెద్ద ప్రమాదంగా పరిగణించబడ్డా కూడా ఇందులో ఎవరు ప్రాణాలు కోల్పోకపోవడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి.
ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. అసలు ఈ ప్రమాదం ఎక్కడ చోటు చేసుకుంది? ఎలా చోటు చేసుకుంది? ప్రమాద సమయంలో ఎంత మంది ప్రయాణికులు హెలికాప్టర్‌లో ఉన్నారు విషయాలపై ఆరా తీస్తున్నారు.
పెద్ద ప్రమాదం తప్పింది..
ప్రమాదం బ్రెజిల్ లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో చోటు చేసుకోగా, ఇందులో బ్రెజిల్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. హెలికాప్టర్ మినాస్ గెరైస్ రాష్ట్రంలో టేకాఫ్ అవుతుండగా.. అక్కడున్న విద్యుత్ తీగలకు తగిలి కింద పడడం జరిగింది.
అందులో మంటలు చెలరేగకముందే అందులో ఉన్న ఆరుగురు బయటపడ్డారు. రెస్క్యూ టీం సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రజాప్రతినిధులందరినీ వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేయించగా, ఎవరికి ప్రాణాపాయం లేదని తేల్చి చెప్పారు.
అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే విషయం గురించి చూస్తే.. హెలికాఫ్టర్‌పై ఫైలెట్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు అంచనాకి వస్తున్నారు. అంతేకాకుండా దీనిపై లోతుగా విచారణ కూడా జరిపిస్తున్నారు.
దీనిపై ఏదైన కుట్ర దాగి ఉందా అనే దానిపై కూడా ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం అయితేఈ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
Moments helicopter hits power line and crashes in Brazil
Horrifying moment helicopter hits power line and crashes – but Brazilian congressman, deputy mayor, staffer and pilot all survive #trendingvideos pic.twitter.com/8DmZOwOv3v— 6IX WORLD NEWS (@6ixworldnews) September 23, 2022