HomehealthArthritis : కీళ్లనొప్పులకు ఈ డైట్ బేషుగ్గా పనిచేస్తుంది.. తీసుకోవాల్సినవి..తీసుకోకూడనివి..

Arthritis : కీళ్లనొప్పులకు ఈ డైట్ బేషుగ్గా పనిచేస్తుంది.. తీసుకోవాల్సినవి..తీసుకోకూడనివి..

Telugu Flash News

ఆర్థరైటిస్ (Arthritis) మన దైనందిన జీవితాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇతరుల మీద ఆధారపడవలసి రావడమో లేదా అతికష్టమ్మీద ఆ పనులు పూర్తి చేయడమో చేస్తుంటారు. అయితే ఈ సమస్య గుర్తించినప్పుడే తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం, ఆలస్యం చేసే కొద్దీ ఈ సమస్య తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది.

ఆర్థరైటిస్ లో సాధారణంగా ఎక్కువ వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ (osteoarthritis), ఇది కార్టిలేజ్ దెబ్బతినడం లేదా ధరించడం వల్ల వస్తుంది, ఇది కీళ్ల వాపు, నొప్పి మరియు కీళ్లు ధృడంగా మారి కదల్చడానికి వీలు లేకుండా ఉండే స్థితికి దారితీస్తుంది. ఈ రకమైన ఆర్థరైటిస్ ఎక్కువగా వయసు మళ్లిన వారిలో చూస్తూ ఉంటాము అయితే తక్కువ వయసున్న వారిలో కీళ్ళకు ఏమైనా దెబ్బతగలడం లేదా ఏదైనా ఆక్సిడెంట్ లో అవి దెబ్బతినడం వంటివి జరిగినవారికి కూడా ఈ సమస్య కనిపించచ్చు.

Arthritis గౌట్ ఆర్థరైటిస్ (gout arthritis) అనేది కీళ్లలో హఠాత్తుగా భరించలేని బాధాకరమైన నొప్పి వస్తుంది. ఇది యువకులు మరియు వృద్ధులలో కనిపిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (rheumatoid arthritis) అనేది ఆటో-ఇమ్యూన్ డిజార్డర్, ఇక్కడ రోగనిరోధక వ్యవస్థ కీళ్ళు మరియు శరీర కణజాలాలపై దాడి చేస్తుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, కీళ్లకు తీవ్ర నష్టం కలిగించి శారీరక వైకల్యానికి దారితీయచ్చు.

“చాలా రకాల ఆర్థరైటిస్‌లకు చికిత్స లేనప్పటికీ, వాటిని మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, ధూమపాన, మద్యం లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం మరియు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది” అన్నారు బెంగళూరుకు చెందిన డాక్టర్ చేతన.

తీసుకోవాల్సినవి:

చేపలు – ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువ ఉండటం వల్ల కొవ్వుతో కూడిన చేపలు నొప్పిని తగ్గించడంలో మనకు సహాయం చేస్తాయి. ఆర్థరైటిస్ డైట్‌లో చేపలు ముఖ్యమైన భాగం, సాల్మన్, ట్యూనా మరియు సార్డిన్‌లు తినడం వల్ల దృఢత్వం మరియు వాపు తగ్గుతుంది.

బీన్స్ – రెడ్ బీన్స్, కిడ్నీ బీన్స్, పింటో బీన్స్ మొదలైనవి యాంటీఆక్సిడెంట్లు నొప్పి, వాపుకు కారణం అయ్యే CRP (C-రియాక్టివ్ ప్రోటీన్) స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బీన్స్ ఎక్కువగా తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

-Advertisement-

గింజలు మరియు విత్తనాలు – గింజలు అధిక కేలరీలు ఉన్న ఆహారాలు అయితే, వాటిని పరిమితంగా తీసుకుంటే వాటి మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వుల వల్ల నొప్పిని అదుపులో ఉంచవచ్చు.

తాజా కూరగాయలు మరియు బెర్రీలు – బచ్చలికూర మరియు బ్రోకలీ వంటి ఆకు మరియు పీచు కలిగిన కూరగాయలు వాపు నుండి ఉపశమనం ఇవ్వడమే కాక వాపును తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీలు మరియు రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లతో ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థరైటిస్ రోగులలో బెర్రీలు మరియు తాజా కూరగాయలు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

తీసుకోకూడనివి: (worst foods to eat for arthritis )

వేయించిన మరియు చక్కెర ఉన్న ఆహారాలు – చక్కెరలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా ఉన్న ఆహారం సమస్యను పెంచుతుంది. ఇది సైటోకిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది ఆర్థరైటిస్ వాపు మరియు నొప్పి పెరుగుదలకు దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని తగ్గించడం కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం.

పాల ఉత్పత్తులు – వీటిలో ఉన్న కొన్ని కొవ్వు ఆమ్లాలు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వాటి వల్ల నొప్పి, వాపు పెరిగే అవకాశం ఉంది. ఆర్థరైటిస్ రోగులు పూర్తిగా కొవ్వు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి,

పొగాకు – పొగాకు వినియోగం వల్ల యాంటీ సిసిపి యాంటీబాడీ పెరగడం వలన ధూమపానం చేసేవారికి తీవ్రమైన డిసేబుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

మీరు ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే, ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామ చేయడం వల్ల సమస్యను చాలా వరకు తగ్గించచ్చు. ద్రవపదార్థాలు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు.

పప్పుధాన్యాలు, దానిమ్మ, గ్రీన్ టీ, బ్రౌన్ రైస్ మరియు గింజలతో పాటు బలవర్ధకమైన పాలు, పెరుగు, నారింజ రసం మరియు తృణధాన్యాల ద్వారా మీ ఆహారంలో విటమిన్ డి చేరుతుంది అది కార్టిలేజ్ ను పునర్నిర్మించడంలో సహాయపడుతుంది.

సరైన శరీర పనితీరు కోసం, మీరు మీ ఆహారంలో కొన్ని సప్లిమెంట్లను జతచేయచ్చు, ఇవి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

ఆహారంపై నియంత్రణ, క్రమం తప్పని వ్యాయాయం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో మీకు సహాయపడుతాయి.

ఇవి కూడా చూడండి :
తీయని పాట మీ గొంతులో పలకాలంటే… ఇలా చేయండి.

రాత్రిపూట తలస్నానం చేస్తే..నష్టమా ? లాభమా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News