Health Tips : మన ఆరోగ్యం మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం అనేక రకాల డైట్ లను అనుసరిస్తారు. దీని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అయితే ఇంట్లో లభించే ఆహార పదార్థాలతో మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మనం రోజూ తినే ఆహారంలో ఈ నాలుగింటిని చేర్చుకోవడం వల్ల జబ్బులు రాకుండా జాగ్రత్తపడవచ్చు. మరి ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో చూద్దాం..
మిల్లెట్స్
మా తాతలు రాగి, జొన్నలు, సజ్జలు ఎక్కువగా తినేవారు. అందుకే వారు చాలా కాలం ఆరోగ్యంగా జీవించారు అని చాలా మంది అనడం మనం వినే ఉంటాం. ఈ మిల్లెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే, జీర్ణక్రియకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఏర్పడటానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. మిల్లెట్లు పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
పప్పులు
మనం తరచుగా తినే పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్ మరియు ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తాయి. ఇది కొత్త కణాల పునరుత్పత్తికి కూడా సహాయపడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్ మరియు జింక్ పప్పులలో కూడా లభిస్తాయి.
పెరుగు
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ప్రొటీన్లు మరియు గట్ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. క్యాల్షియంతో పాటు విటమిన్ బి2, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మరియు దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాలను తగ్గిస్తుంది.
మసాలా దినుసులు
మనం నిత్యం మసాలా దినుసులను వంటల్లో ఉపయోగిస్తుంటాం. కూరల్లో వాడే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంలో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి.
also read :
ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
PCOS Diet : పాలీసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?