Telugu Flash News

Health Tips in Telugu : ఆరోగ్య చిట్కాలు (19-07-2023)

health tips in telugu

Health Tips in Telugu

  1. గొంతు గరగరలాడుతుంటే అల్లం, తులసి ఆకులు మరిగించి కొంచెం తేనె కలిపి త్రాగండి.
  2. విరేచనాలు ఆగిపోవడానికి నిమ్మరసం, ఉసిరిక రసం రెండూ కలిపి త్రాగండి. జిగట విరేచనాలు, కడుపునొప్పి మటుమాయం కావాలంటే ఒక స్పూను ఉసిరికాయ రసాన్ని గసగసాలపాలు, పంచదారతో కలిపి రోజూ రెండుపూటలా తీసుకోండి.
  3. కళ్ళలో ఇసుకరేణువు గానీ, నలక గానీ పడితే నాలుగైదు చుక్కల పాలను కంట్లో వేసుకుని తలను పక్కకు వాల్చి పడుకుంటే నలకలు బయటకు వస్తాయి.
  4. రోజూ చిన్న అల్లం ముక్క లవంగం ఒకటి రెండు చప్పరిస్తుంటే గ్యాస్ మూలంగా వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.
  5. ముక్కు నుంచి రక్తం కారుతుంటే నాలుగు దానిమ్మరసం చుక్కల్ని ముక్కులో వేస్తే రక్తం పడడం ఆగుతుంది.
  6. ఆలివ్ లేదా కలబంద రసం రాస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
  7. నొప్పిగా ఉన్నచోట కలబందరసం రాస్తే 10 నిముషాలలో బాధ ఉపశమనం.
  8. కడుపులో మంటగా ఉంటే భోజనం తర్వాత గ్లాసుడు నీటిలో కాసింత బెల్లం కలుపుకొని తాగితే మంట తగ్గుతుంది.
  9. ఆయాసంతో బాధపడేవారికి మిరియాల పొడిలో వెన్న కలిపి తినిపిస్తే ఆయాసం తగ్గుతుంది.
  10. బ్యాక్ పెయిన్ తో బాధపడేవారు లావెండర్, జింజర్, యూకలిప్టస్ ఆయిల్స్ను నమపాళ్ళలో కలిపి మసాజ్ చేసుకోవాలి.
  11. ఒక గ్లాసు నీటిలో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని పరగడుపున తాగితే ఎండకు బయటకు వెళ్ళినా కూడా వడదెబ్బ ప్రభావం అంతగా పడదు.
  12. తలనొప్పి తగ్గాలంటే నిమ్మకాయ సగానికి కోసి నుదుటిపై రుద్దాలి.
  13. ప్రతిరోజూ గోరువెచ్చని ఆయిల్తో శరీరానికి మసాజ్ చేసుకుంటే మెనోపాజ్ దశలో కలిగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చు.
  14. ముల్లంగిని ఆహారంలో చేర్చడంవల్ల రక్తశుద్ధి జరుగు తుంది. మూత్రకోశ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
  15. రోజుకు మూడు, నాలుగు కరివేపాకులను నమిలితే నోరు శుభ్రపడుతుంది. చిగుళ్ళ, పళ్ళ సమస్యలకు కూడా దూరమే! నోటి అరుచి పోతుంది కూడా !
  16. నిమ్మనూనెలో రెండు చుక్కల వేపనూనె వేసి రాత్రిపూట దీపం వెలిగిస్తే గదంతా సువాసన పరచుకోవడంతో పాటు దోమలు దగ్గరకు రావు. దోమలు లేకుంటే జబ్బులూ దూరమే !
  17. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలను వీలైనంత సహజ రూపంలో తీసుకుంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది.
  18. నీటిని, ఇతర ద్రవ పదార్థాలను రోజుకు 4 లీటర్ల వరకూ తీసుకోవాలి.
  19. రోజూ నిమ్మరసం, సొరకాయ రసం కలిపి తీసుకుంటే గుండె పటిష్టమవుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక టేబుల్ స్పూను నిమ్మరసం కలుపుకోవాలి.
  20. వారానికి ఒకేసారి దాల్చినచెక్క లేదా లవంగ నూనెలో దూదితో పలువరుసను రుద్దినట్లయితే పిప్పి పళ్ళు రావు. పిప్పిపన్ను వచ్చి నొప్పి చేసినప్పుడు ఈ నూనెలలో దూదిని ముంచి నొప్పి ఉన్నచోట పెడితే ఉపశమనం కలుగు తుంది.
  21. ప్రతిరోజూ మొలకెత్తిన పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలు తీసుకుంటే గుండె కండరాలు శక్తివంతమవుతాయి.
  22. ఎండాకాలంలో ఎంత నీరు తాగినా దాహం తీరినట్ల నిపించదు. అలాంటప్పుడు ఉదయం కాని, మధ్యాహ్నం కాని ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ యాలకుల పొడి కలిపి తాగితే ఉపశమనమే! రుచి కోసం చక్కెర కలుపుకోవచ్చు.
  23. కొందరికి ప్రయాణంలో అతి దాహం బాధ పెడుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏలక్కాయను నోట్లో వేసుకుంటే దాహం అనిపించదు.
  24. దోమలు, తేనెటీగలు కుట్టినప్పుడు గాయం మీద యాస్పిరిన్ మాత్రను నీటిలో తడిపి ముద్ద చేసి పెడితే నొప్పి తగ్గుతుంది.

also read :

Health Tips in Telugu : ఆరోగ్య చిట్కాలు (18-07-2023)

Health Tips (14-03-2023) : ఈ 10 ఆరోగ్య చిట్కాలు.. మీ కోసం..

Exit mobile version